Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'కోడి' మంచి మనిషి... మా అనుబంధం మరువలేనిది : చిరంజీవి

Advertiesment
'కోడి' మంచి మనిషి... మా అనుబంధం మరువలేనిది : చిరంజీవి
, శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (21:00 IST)
టాలీవుడ్ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపారు. ఈయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. రామకృష్ణ మరణం వార్త తెలిసి పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు.
 
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి కోడి రామకృష్ణ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో మా అనుబంధం మొదలైంది. ఆ సినిమా 500 రోజులకుపైగా ఆడి మాకు అరుదైన రికార్డును తీసుకొచ్చిందని గుర్తు చేసుకున్నారు.
 
దాసరి నారాయణరావు లాంటి వారి తర్వాత వందకు పైగా సినిమాలు చేసిన ఘనత దక్కించుకుని దాసరి గారికి తగిన శిష్యుడు అనిపించుకున్నారు. ఆయన తలకు రుమాలు కట్టినప్పటి నుంచి దాన్ని తీసే వరకు పని తప్ప వేరే ధ్యాస ఉండదు. అంతటి కష్టపడే మనిషి కాబట్టే ఆయన అన్ని సినిమాలు చేయగలిగారు.
 
ఇకపోతే, హీరో వెంకటేష్ మాట్లాడుతూ, మీరు లేని లోటు పూడ్చలేనిది. ఎన్నో గొప్ప చిత్రాలను అందించినందుకు థ్యాంక్స్. మీ ఆత్మకు శాంతి కలుగాలి. మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. 
 
ఆయన ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించారనీ ప్రముఖ నిర్మాత, క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు అన్నారు. పైగా, ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉత్తమ దర్శకుడు, పరిశ్రమలో అందరికీ ఎంతో ఆప్తుడు, నాకు మంచి మిత్రులు అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని ఆ దేవుడుని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. 
 
అలాగే, నిర్మాతల మండలి అధ్యక్షుడు డాక్టర్ కేఎల్ నారాయణ మాట్లాడుతూ, కోడి రామకృష్ణగారు నాకు ఎంతో ఆత్మీయులు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ మంచి మిత్రులు. అందరితోనూ ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. అందరితో కలుపుగోలుగా ఉండేవారు. మా బ్యానర్‌లో దొంగాట చిత్రాన్ని నిర్మించారు. మంచి మనిషి. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా లోటు. వ్యక్తిగతంగా మంచి మిత్రుడుని కోల్పోయాను అని ఆయన వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై.. శ్రీరెడ్డి కామెంట్స్.. వామ్మో ఉతికేసింది..