Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చనిపోయిన హీరోతో కూడా సినిమా తీసిన ప్రతిభాశాలి కోడిరామకృష్ణ..

చనిపోయిన హీరోతో కూడా సినిమా తీసిన ప్రతిభాశాలి కోడిరామకృష్ణ..
, శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:42 IST)
కోడి రామకృష్ణ తెలుగు చలనచిత్రాలలో ప్రప్రథమంగా గ్రాఫిక్స్ సాయంతో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను తీసాడు. అలాగే వాటిని కమర్షియల్‌గా హిట్ చేయగలిగాడు. అమ్మోరు, దేవీ, దేవీపుత్రుడు, అరుంధతి వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఎప్పుడో చనిపోయిన ఓ నటుడితో 2016లో ఓ సినిమా తీసి సరికొత్త ప్రయోగానికి నాంది పలికాడు.
 
2009లో చనిపోయిన కన్నడ హీరో విష్ణువర్ధన్‌తో కోడి రామకృష్ణ సినిమా తీసాడు. కన్నడలో విష్ణువర్ధన్ అప్పట్లో ఒక స్టార్ హీరో. 1972లో విష్ణువర్ధన్ హీరోగా నాగరహావు అనే సినిమా వచ్చింది. ఇదే సినిమాను ఉపేంద్ర సైతం రీమేక్ చేసాడు. అయితే కోడిరామకృష్ణ అదే చిత్రాన్ని విష్ణువర్ధన్ హీరోగా నాగరాహువు అనే టైటిల్‌తో తెరకెక్కించాడు.
 
ఈ చిత్రం తెలుగులోనూ నాగాభరణం టైటిల్‌లో విడుదలైంది. విష్ణువర్ధన్ చనిపోయినప్పటికీ గ్రాఫిక్స్ ద్వారా అతడిని వెండితెరపై పునఃసృష్టించడం కోడి రామకృష్ణకే చెల్లింది. ఇందులో రమ్య, డిగంత్, రాజేశ్, వివేక్ ఉపాధ్యాయ్, ముకుల్ దేవ్ ప్రధాన పాత్రలు పోషించగా, గురుకిరణ్ సంగీతం సమకూర్చాడు. 2016లో వచ్చిన ఈ చిత్రం కోడి రామకృష్ణకు చివరి చిత్రం కావడం గమనార్హం.
 
విష్ణువర్ధన్ రూపాన్ని మళ్లీ తెరపై చూపేందుకు ఏడు దేశాలకు చెందిన 576 మంది గ్రాఫిక్ నిపుణులు 730 రోజులపాటు కష్టపడ్డారట. గత చిత్రాలలో ఎప్పుడూ చూపని విధంగా 120 అడుగుల శివనాగాన్ని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చనిపోయిన హీరోని తీసుకుని పూర్తి స్థాయిలో ఒక సినిమాను చిత్రీకరించడం భారతదేశ చలనచిత్ర చరిత్రలో అదే ప్రప్రథమం. ఈ ఘనత సాధించిన వాడు మన తెలుగు దర్శకుడు కావడం మనందరికీ గర్వకారణం. అంతటి గొప్ప దర్శకుడు మనందరి మధ్య లేకపోవడం బాధాకరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొమ్మ వేయమని చెప్పాను కదా..?