Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మలయాళంలో ప్రకంపనలు రేపుతున్న జస్టిస్ హేమ కమిషన్... కేంద్ర మంత్రి సురేష్ గోపి ఫైర్!

romance

ఠాగూర్

, మంగళవారం, 27 ఆగస్టు 2024 (13:35 IST)
మలయాళ చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇపుడు ఆ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతుంది. అనేక బాధిత నటీమణులు ముందుకు వచ్చి పలువురు హీరోలపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూడా కేంద్ర మంత్రి, సినీ నటుడు సురేష్ గోపి మీడియాపై మండిపడ్డారు. అన్నీ తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ అంశంపై కేరళ ప్రభుత్వానికి జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. ఇది మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. కమిటీ తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. కొంతమంది నటులు, నిర్మాతలు, దర్శకులు.. నటీమణులను లైంగికంగా వేధింపులకు గురిచేశారని, తీవ్ర ఇబ్బందులు పెట్టారని పేర్కొంది. జస్టిస్ హేమ కమిటీ నివేదికను సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ సర్కార్.. విచారణ చేపట్టాలని నిర్ణయించి, ఏడుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 
 
ఈ క్రమంలో మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు గతంలో ఎదురైన చేదు అనుభవాలను మీడియాకు వెల్లడించారు. ఓ నటి జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వివరించారు. నలుగురు సహచర నటులు తనను లైంగికంగా వేధించి, దూషించారని ఆరోపించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో జయసూర్య కారణంగా చేదు అనుభవం ఎదురైందని చెప్పారు. తాను బాత్ రూమ్కు వెళ్లి వస్తుండగా, జయసూర్య వెనుక నుండి వచ్చి తనను కౌగిలించుకొని ముద్దు పెట్టాడని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే తాను అక్కడ నుండి వెళ్లిపోయానని ఆమె తెలిపారు. తనతో ఉంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తానని జయసూర్య ఆ తర్వాత తనతో చెప్పాడని ఆమె పేర్కొన్నారు.
 
అసోసియేషన్‌లో సభ్యత్వం కోసం మలయాళీ మువీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ ఇడవేల బాబును తాను సంప్రదిస్తే ఇంటికి రమ్మని చెప్పాడని, తాను వెళ్లగా ఆయన శారీరకంగా వేధించాడని మరో మలయాళీ నటి ఆరోపించింది. నటుడు, సీపీఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎం ముకేశ్, మణియన్ పిళ్ల రాజుపై కూడా ఆమె ఇదే విధమైన ఆరోపణలు చేశారు. వేధింపుల కారణంగా మలయాళ చిత్ర పరిశ్రమను వదిలి చెన్నైకు వెళ్లిపోయేలా చేశారని ఆమె చెప్పుకొచ్చారు. 
 
ఇలా ఒక్కరొక్కరుగా గతంలో చిత్ర సీమలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెట్టేందుకు మీడియా ముందుకు వస్తుండం మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. ఈ అంశాన్ని తన ప్రస్తావించిన మీడియాపై కేంద్ర సహాయ మంత్రి, సీనియర్ సినీ నటుడు సురేష్ గోపి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాస్టింగ్ కౌచ్ లేదు ఏమీ లేదూ.. అంత దుష్ప్రచారమే అంటూ మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఎమర్జెన్సీ' మూవీ ఎఫెక్ట్ : బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు హత్యా బెదిరింపులు!