Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాతృదేవోభవ నేను సగర్వంగా చెప్పుకునే సినిమా- సుధ

Advertiesment
మాతృదేవోభవ నేను సగర్వంగా చెప్పుకునే సినిమా- సుధ
, బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (18:58 IST)
Sudha, Harnath Reddy, Chodavarapu Venkateswarao and others
శ్రీవాసవి మూవీస్ పతాకంపై కె.హరనాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరావు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న చిత్రం "మాతృదేవోభవ". 'ఓ అమ్మ కథ' అన్నది ఉప శీర్షిక. వెయ్యి సినిమాలకు పైగా నటించిన సీనియర్ నటీమణి సుధ తన కెరీర్ లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్, అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ప్రముఖ రచయిత మరుదూరి రాజా సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, పోసాని, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "మాతృదేవోభవ" ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర యూనిట్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో టైటిల్ పాత్రధారిణి సుధ, నిర్మాతలు చోడవరపు వెంకటేశ్వరావు-ఎమ్ ఎస్.రెడ్డి, దర్శకులు హరనాథ్ రెడ్డి, ఈ చిత్రంలో నటించిన చమ్మక్ చంద్ర, జెమిని సురేష్, శ్రీహర్ష, కీర్తి, సత్యశ్రీ పాల్గొన్నారు.
 
సుధ మాట్లాడుతూ, "ఇది నా సినిమా" అని నేను గర్వంగా చెప్పుకునే సినిమా "మాతృదేవోభవ". ఫస్ట్ టైమ్ డైరెక్టర్ హరనాధ్ రెడ్డి, ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్స్ చోడవరపు వెంకటేశ్వరావు-ఎమ్.ఎస్.రెడ్డిలకు చాలా మంచి పేరు తెస్తుంది. ఇందులో నటించిన, ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన "మాతృదేవోభవ" మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.
 
నిర్మాతలు చోడవరపు వెంకటేశ్వరావు-ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ, "మాతృదేవోభవ" వంటి మంచి సినిమాతో నిర్మాతలుగా పరిచయమవుతుండడం అదృష్టంగా భావిస్తున్నామని, సుధ గారి కెరీర్ లో ఈ చిత్రం ఓ కలికితురాయిగా నిలుస్తుందని, ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా "మాతృదేవోభవ" చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. హీరో పతంజలి శ్రీనివాస్, ముఖ్యపాత్రధారులు జెమిని సురేష్, చమ్మక్ చంద్ర, శ్రీహర్ష, కీర్తి, సత్యశ్రీ  "మాతృదేవోభవ" సినిమాలో నటించే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసి, ఈ చిత్రం కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. 
చిత్ర దర్శకుడు హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. "మాతృదేవోభవ" వంటి సందేశాత్మక చిత్రంతో దర్శకుడిగా మారుతుండడం గర్వంగా ఉందన్నారు. నిర్మాతలకు, సీనియర్ నటీమణి సుధ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
సూర్య, జెమిని సురేష్, శ్రీహర్ష, సత్యశ్రీ, సోనియా చౌదరి, అపూర్వ, కీర్తి, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణప్రసాద్, ఫైట్స్: డైమండ్ వెంకట్, కెమెరా: రామ్ కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం: జయసూర్య, పాటలు: అనంత్ శ్రీరామ్-పాండురంగారావు- దేవేందర్ రెడ్డి, మాటలు: మరుదూరి రాజా, కథ: కె.జె.ఎస్.రామారెడ్డి (సితారె), సమర్పణ: ఎం.ఎస్.రెడ్డి, నిర్మాత: చోడవరపు వెంకటేశ్వరావు, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: కె.హరనాథరెడ్డి!!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిజె టిల్లు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది - నిర్మాత నాగవంశి