Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిప్ప త‌ప్ప ఏమీ మిగ‌ల్లేదు.. కేంద్రాన్ని న‌మ్మ‌ుకుంటే సంకనాకి పోతాం : మంచు మనోజ్

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటామని నమ్మించి.. వంచించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని హీరో మంచు మనోజ్ తూర్పారబట్టారు. విభజన వల్ల నష్టపోయిన మనకు చిప్ప తప్ప ఏమీ మిగల్లేదని, కేంద్రాన్ని నమ్ముకుంటే సం

Advertiesment
చిప్ప త‌ప్ప ఏమీ మిగ‌ల్లేదు.. కేంద్రాన్ని న‌మ్మ‌ుకుంటే సంకనాకి పోతాం : మంచు మనోజ్
, మంగళవారం, 13 మార్చి 2018 (14:26 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటామని నమ్మించి.. వంచించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని హీరో మంచు మనోజ్ తూర్పారబట్టారు. విభజన వల్ల నష్టపోయిన మనకు చిప్ప తప్ప ఏమీ మిగల్లేదని, కేంద్రాన్ని నమ్ముకుంటే సంకనాకి పోతామంటూ ఘాటు పదజాలంతో ట్వీట్ చేశారు. 
 
నిజానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ద‌క్క‌క‌పోవ‌డంపై సామాన్యుల‌తోపాటు సినీ ప్ర‌ముఖులు సైతం ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే హీరో నిఖిల్‌, దర్శకుడు కొర‌టాల శివ‌, హీరో మోహ‌న్‌బాబు, స్క్రిప్టు రైటర్స్ బీవీయ‌స్ ర‌వి, కోన వెంక‌ట్ త‌దిత‌రులు కేంద్రంపై, ప్ర‌ధాని నరేంద్ర మోడీపై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెల్సిందే. 
 
తాజాగా హీరో మంచు మ‌నోజ్ ఏపీకి ప్ర‌త్యేక హోదా ద‌క్క‌క‌పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాడు. ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స్పందిస్తూ ఘాటుగా స‌మాధానాలిచ్చాడు. మ‌హారాష్ట్ర‌లో రైతుల డిమాండ్ల‌కు అంగీక‌రిస్తూ ప్ర‌భుత్వం రాత‌పూర్వ‌కంగా హామీలిచ్చింది అని ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు మ‌నోజ్ ఘాటుగా స్పందించాడు. 
 
'మ‌న‌కు ప్ర‌త్యేక హోదా కూడా ఇస్తా అన్నారు. చిప్ప త‌ప్ప ఏమీ మిగ‌ల్లేదు. కేంద్రాన్ని న‌మ్మ‌కుంటే సంకనాకి పోతాం' అని మ‌నోజ్ స‌మాధానం ఇచ్చాడు. అనంత‌రం 'రాష్ట్రంలో ఏ పార్టీని న‌మ్మాలి' అనే మ‌రో ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. 'నిన్ను న‌మ్ముకోవ‌డం ఉత్త‌మం' అని జవాబిచ్చాడు. అలాగే మ‌రో ప్ర‌శ్న‌కు జ‌వాబిస్తూ.. 'ద‌క్షిణాదిలో రెండో రాజ‌ధాని పెట్టే వర‌కు మ‌న‌కు ఈ బానిస బ‌తుకులు త‌ప్ప‌వు' అంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవును.. నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను: గాయని చిన్మయి