Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మమతా మోహన్ దాస్ ‘లాల్ బాగ్’ ఫస్ట్ లుక్

Advertiesment
మమతా మోహన్ దాస్ ‘లాల్ బాగ్’ ఫస్ట్ లుక్
, శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (16:55 IST)
lal bagh
రాజమౌళి, ఎన్‌.టి.ఆర్‌. సినిమా `యమదొంగ` ఫేమ్ మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘లాల్ బాగ్’. ఐటి బ్యాక్ డ్రాప్ లో సాగే థ్రిల్లర్ జానర్ లో రాబోతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై  రాజ్ జకారియా నిర్మిస్తోన్న ఈ మూవీ తెలుగు టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
చాలా రోజుల తర్వాత మమతామోహన్ దాస్ ఓ బలమైన పాత్రలో కనిపించబోతోందీ చిత్రంతో. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అంశాలతో వస్తోన్న ఈ మూవీలో మమతా మోహన్ దాస్ తో పాటు నందినిరాయ్, సిజోయ్ వర్ఘిస్, రాహుల్ దేవ్ శెట్టి(బాలీవుడ్ యాక్టర్), రాహుల్ మాధవ్, అజిత్ కోషీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 
ఏ సంపత్ కుమార్ సగర్వంగా సమర్పిస్తోన్న ఈ చిత్రానికి  సంగీతం: రాహుల్ రాజ్, సినిమాటోగ్రఫీః ఆంటోని జో, ఎడిటర్: సునీశ్ సెబాస్టియన్, నిర్మాత: రాజ్ జకారియాస్, దర్శకత్వం: ప్రశాంత్ మురళీ పద్మనాభన్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస‌క్తిరేకెత్తించేలా శుక్ర