యూట్యూబ్‌ను షేక్ చేసిన 'జిమ్మిక్కి కమ్మల్' పాట తొలగింపు.. ఎందుకు?
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన చిత్రం "వెళిపడింతె పుస్తకం". ఈ చిత్రంలోని 'జిమ్మిక్కి కమ్మల్' పాట ఎంత పాపులర్ అయిందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. భాషా భేదం లేకుండా ఈ సాంగ్‌ని ప్రతి ఒక్కరు ఆడిపా
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన చిత్రం "వెళిపడింతె పుస్తకం". ఈ చిత్రంలోని 'జిమ్మిక్కి కమ్మల్' పాట ఎంత పాపులర్ అయిందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. భాషా భేదం లేకుండా ఈ సాంగ్‌ని ప్రతి ఒక్కరు ఆడిపాడారు. కొందరు పేరడీలు చేశారు. వేరే భాషలకి చెందిన సెలబ్రిటీలు కూడా ఈ పాటను ఎంతగానో ఇష్టపడ్డారు.
ఒక విధంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీతో పాటు యూట్యూబ్‌ను కూడా షేక్ చేసింది. యూ ట్యూబ్‌లో ఈ పాటకు దాదాపు 80 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అలాంటి పాటను ఇపుడు యూట్యూబ్ నుండి తొలగించారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు షాన్ రెహమాన్ తన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు.
'వెళిపడింతె పుస్తకం' చిత్ర కాపీ రైట్స్ ఓ ఛానెల్ కొనుక్కుంది. కాపీ రైట్ కారణాల వలన ఆ సాంగ్‌ని తొలగించారంటూ రెహమాన్ తెలిపారు. అయితే యూట్యూబ్ నుండి అలా తొలగించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదేమైన అందరిని అంతగా ఓ ఊపు ఊపిన ఆ సాంగ్ ఇంటర్‌నెట్‌లో లేకపోవడంపై అనేక మంది నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.