Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సింజిత్.. ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్... మహేశ్

Advertiesment
little hearts

ఠాగూర్

, బుధవారం, 17 సెప్టెంబరు 2025 (23:03 IST)
లిటిల్ హార్ట్స్ చిత్ర బృందాన్ని హీరో మహేశ్ బాబు అభినందించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. రూ.2.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం పది రోజుల్లో ఏకంగా రూ.32 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సినీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో అగ్రహీరోలు అల్లు అర్జున్, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ వంటి పలువురు సినిమా చూసి ప్రశంసల వర్షం కురిపించారు. ఆ జాబితాలో మహేశ్ బాబు చేరిపోయారు. తన ప్రశంసలతో సినిమాకు మరింత ప్రచారం లభించినట్లయింది.
 
ఈ చిత్రాన్ని చూసిన హీరో మహేశ్ బాబు నుంచి చిత్ర బృందానికి ఊహించని ప్రశంసలు అందాయి. సినిమా విజయంపై సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ముఖ్యంగా చిత్ర సంగీత దర్శకుడు సింజిత్ ఎర్రమల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో చిత్ర యూనిట్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 'లిటిల్ హార్ట్స్' సంగీత దర్శకుడు సింజిత్, మహేశ్ బాబుకు వీరాభిమాని. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో, "నా దేవుడు మహేశ్ అన్న మా సినిమాపై ఒక్క ట్వీట్ చేస్తే చాలు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం రోజులు ఎక్కడికైనా వెళ్లిపోతాను" అని తన ఆనందాన్ని పంచుకున్నారు. 
 
ఈ విషయం మహేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన తన అభిమానిని నిరాశపరచలేదు. 'లిటిల్ హార్ట్స్' సినిమాపై ప్రత్యేకంగా రివ్యూ ఇస్తూ, "సినిమా చాలా సరదాగా, కొత్తగా, అద్భుతంగా ఉంది. నటీనటులందరూ అసాధారణంగా నటించారు" అని కొనియాడారు. ఇదే పోస్టులో సింజిత్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, "సింజిత్, ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్. నీకు ముందు చాలా బిజీ రోజులు వస్తాయి. రాకింగ్ చేస్తూ ఉండాలి. మొత్తం టీంకి నా అభినందనలు" అని సూపర్ స్టార్ పేర్కొన్నారు. 
 
ఎప్పుడూ లేని విధంగా తన పోస్టులో లవ్, స్మైలీ ఎమోజీలను జోడించడం విశేషం. ఇక, తన అభిమాన హీరో నుంచి వచ్చిన ఈ స్పందనతో సింజిత్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. "నేను ఎక్కడికీ వెళ్లను మహేశ్ అన్నా" అని బదులిస్తూ, 'గుంటూరు కారం'లోని పాటకు మహేశ్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. చిత్ర దర్శకుడు సాయి మార్తాండ్ కూడా, "థ్యాంక్స్ సార్. ఇది ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Atharva Murali: అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్ రాబోతోంది