Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ 'మహర్షి' మంచి కిక్ ఇస్తున్నాడుగా...

Advertiesment
మహేష్ 'మహర్షి' మంచి కిక్ ఇస్తున్నాడుగా...
, బుధవారం, 2 జనవరి 2019 (14:57 IST)
‘సూప‌ర్ స్టార్ మహేష్‌ బాబు నటిస్తున్న చిత్రం మ‌హ‌ర్షి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌ముఖ నిర్మాత‌లు అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ గ‌తంలో రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా సెకండ్ లుక్ రిలీజ్ చేసారు. 

ఇందులో మ‌హేష్ ఎన్నడూ లేని బియర్డ్‌ లుక్‌లో మహర్షి చిత్రంలో కనిపించేసరికి సూపర్‌స్టార్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూవీ నుంచి మరో లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 
 
సూట్‌లో అలా స్టైలిష్‌గా మహేష్‌ నడుస్తూ ఉండగా.. పక్కన ఉన్నవారు గొడుగు పట్టుకుని ఉన్న ఈ లుక్‌ ప్రిన్స్‌ అభిమానులకు మంచి కిక్కిచ్చేలా ఉంది. స్టూడెంట్‌గా కాలేజ్‌లో నడుస్తు వచ్చిన టీజర్‌లో మహేష్‌ గడ్డంతో ఉండగా, ఈ లుక్‌లో పవర్‌ఫుల్‌ బిజినెస్‌మెన్‌లా కనిపిస్తున్నాడు.  అల్లరి నరేష్ కీల‌క‌ పాత్రను పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయ‌నున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి అదే పెద్ద రీసెర్చ్