Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూలుక్‌లో మహేశ్ బాబు.. రాజమౌళి ప్రాజెక్టు కోసమేనా?

Advertiesment
mahesh new look

ఠాగూర్

, సోమవారం, 23 సెప్టెంబరు 2024 (17:10 IST)
టాలీవుడ్ అగ్ర హీరో మహేశ్ బాబు దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రే
వంత్ రెడ్డికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఈ విరాళాన్ని మహేశ్ బాబు దంపతులు ఇచ్చారు. ఈ చెక్కును సోమవారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి స్వయంగా అందజేశారు. 
 
అయితే, మహేశ్ బాబు కొత్త లుక్‌‍లో కనిపించడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుంటా పోయాయి. మహేష్ న్యూలుక్‌ను చూసి ఆయన ఫ్యాన్స్ అలాంటి అనుభూతికే లోనవుతున్నారు. మహేశ్, రాజమౌళి కలయికలో రూపొందనున్న చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో మహేశ్ ఎలా కనిపించబోతున్నాడనే విషయంపై అభిమానుల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఘట్టమనేని హీరో కూడా ప్రస్తుతం అదే మేకోవర్‌లో ఉన్నారు. 
 
అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఇండియానా జోన్స్ నేపథ్యంలో ఉంటుందని ఇటీవల రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెల్సిందే. అయితే ఈ చిత్రంలో మహేశ్ లుక్‌‍పై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఫోటోలో లాంగ్ హెయిర్, గడ్డం, వైట్ ఫుల్‌హ్యాండ్ టీషర్టులో కనిపిస్తున్న మహేశ్ బాబును చూసి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ హీరో రాజమౌళి సినిమాలో ఇదే లుక్‌లో కనిపించబోతున్నాడని చర్చించుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది : చిరంజీవి