మత్తువదలరా2 చిత్రానికి యూత్ బ్రహ్మరథం పట్టారు. ఆ ఉత్సాహంతో పార్ట్ 3 కూడా ప్లాన్ చేసే ఆలోచనలో వున్నారు డైరెక్టర్ రితేష్ రానా. కాగా, ఫస్ట్ పార్ట్ లో కమేడియన్ సత్యపై చేశారు. కానీ అందులో కుదరక సెకండ్ పార్ట్ లో పెట్టారు. అది బాగా ప్రేక్షకులకు బాగా నచ్చింది. సెప్టెంబర్ 13న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షుకులని అలరించిన హిలేరియస్ బ్లాక్ బస్టర్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక ఈ విజయం గురించి దర్శకుడు రితేష్ ఇలా తెలియజేస్తున్నారు.
- సత్య పై పదహారేళ్ళ వయసు సాంగ్ ముందే ప్లాన్ చేశాం. అది ఫస్ట్ పార్ట్ లో తీసింది. అప్పుడు లెంత్ ఎక్కువైయిందని కట్ చేశాం. సెకండ్ పార్ట్ లో మళ్ళీ అలాంటి సిట్యువేషన్ వచ్చినపుడు అది ప్లేస్ చేశాం. థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
- చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి వంటివారు చేసిన ట్వీట్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది.
-మత్తువదలరాకు సీక్వెల్ చేయాలని నిర్మాత చెర్రీ ఎప్పటినుంచో అన్నారు. అయితే ఆర్గానిక్ గా ఓ మంచి ఐడియా వస్తేనే చేయాలి. అలాంటి ఐడియా క్రాక్ చేసి చెర్రీగారికి, టీంకి చెప్పాను. అది అందరికీ నచ్చింది. మేము అనుకున్నట్లే వర్క్ పుట్ అయ్యింది. ఆడియన్స్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
- ఇందులో ఖుషి రిఫరెన్స్ తీసుకొని అజయ్ క్యారెక్టర్ చేయాలనే ఐడియా నాదే. ఆ క్యారెక్టర్ గ్రో చూపించాలనేది ఐడియా. వున్న మూడు నిమిషాల్లో ఆయన క్యారెక్టర్ ఎస్టాబ్లెస్ చేయాలనుకున్నపుడు ఆయన చేసిన పాత సినిమాని వాడాలకున్నాను. అలా చూసిన వెంటనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారనేది ఆలోచన.
-స్లేవ్ డ్రగ్ ని ఒక మెటాఫర్ లా వాడం. మత్తు అనేది కేవలం నార్కోటిక్స్ నే కాదు. మత్తు చాలా రకాలుగా వుంది. ముత్తు నుంచి బయటపడటం మంచిదని చెప్పడం దాని ఉద్దేశం.
-ఫారియా కూడా అద్భుతంగా చేశారు. ఆమెని ద్రుష్టిలో పెట్టుకునే ఆ క్యారెక్టర్ రాశాను. తను ఈ సినిమాకి ఒక ర్యాప్ సాంగ్ చేశారు. అది మూవీ ప్రమోషన్స్ కి యూజ్ అయ్యింది.
- సినిమాకి మ్యూజిక్ చాలా హెల్ప్ అయ్యింది. కాల భైరవతో మంచి సింక్ కుదిరిపోయింది. ఇన్ పుట్స్ ఏమీ ఇవ్వను. నేను సినిమా రీల్స్ పంపిస్తా. తను మ్యూజిక్ చేసి పిలుస్తారు.
- మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్, ప్లేస్ మెంట్స్ వున్నాయి. వాటిని ఇంకా డెవలప్ చేయాలి. ఇంకో సినిమా చేసిన తర్వాత పార్ట్ 3 వుంటుంది. నెక్స్ట్ సినిమా కూడా చెర్రీ గారితోనే చేస్తాను.