రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా "మాటరాని మౌనమిది". ఈ చిత్రంతో అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ లో ట్రైన్ అయ్యిన మహేష్ దత్త, తెలుగు అమ్మాయి సోని శ్రీవాస్తవ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో ముల్టి జోనర్‌గా రూపొందుతున్న "మాటరాని మౌనమిది" సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన చిత్ర గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'దం దం దంపుడు లక్ష్మీ' అనే లిరికల్ పాటను విడుదల చేశారు.
అషిర్ లూక్ స్వరపర్చిన ఈపాటకు డి సయ్యద్ బాషా సాహిత్యాన్ని అందించగా..రేవంత్, మనీషా పాండ్రంకి, యువరాహుల్ కనపర్తి ఆలపించారు. ఈ పాటలో జాస్ప్రీత్ కౌర్ నటించారు . ఈ పాట ఎలా ఉందో చూస్తే..దం దం దంపుడు లక్ష్మీ..మాయదారి మాపటేల చిన్నోడు సూటు బూటు ఏసుకుని నా కంట పడ్డాడు, మాయదారి మాపటేల చిన్నోడు ఫారిన్ సెంటు పూసుకుని నా వెంట పడ్డాడు, దుబాయి జావిదును కలిపిస్తానన్నాడు, నూజివీడు మామిడి తోట రాసిస్తానన్నాడు..అంటూ మాస్ ను ఆకట్టుకునేలా సాగిందీ పాట. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది.
నటీ నటులు - మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి,
సంజీవ్ , శ్రీహరి తదితరులు.
సాంకేతిక వర్గం - , సినిమాటోగ్రఫీ చరణ్, మ్యూజిక్: అషీర్ లూక్, పిఆర్ఒ
ః జియస్ కె మీడియా, నిర్మాత ః రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్, దర్శకుడు ః సుకు పూర్వాజ్