Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

కేసీఆర్ కు మద్యంషాపులపై ఉన్న ప్రేమ రైతులపై లేదు: రేవంత్​ రెడ్డి

Advertiesment
KCR
, శనివారం, 6 నవంబరు 2021 (20:06 IST)
కేసీఆర్ కు మద్యంషాపులపై ఉన్న ప్రేమ రైతులపై లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ...
 
 "కేసీఆర్ కు మద్యంషాపులపై ఉన్న ప్రేమ రైతులపై లేదు.  ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాల్సింది పోయి.. కొత్త వైన్​షాపులకు కేసీఆర్​ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరవలేదు కానీ.. మద్యం దుకాణాలు తెరిచేందుకు సిద్దమైతున్నారు.

కేసీఆర్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు.. 40 వేల మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లందరి ఆత్మహత్యకు సీఎం కేసీఆరే కారకుడు. ఇప్పటికైనా.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచి.. రైతు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధర ఇచ్చి కొనాల్సిందే. రైతుల తరఫున కొట్లాడేందుకు కాంగ్రెస్​ సిద్ధంగా ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న దుర్మర్గపు విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కాంగ్రెస్​ సిద్ధమవుతోంది. పెట్రోల్​, డీజీల్​పై రాష్ట్ర ప్రభుత్వం పది రూపాయలు తగ్గించాలని కాంగ్రెస్​ తరఫున డిమాండ్​ చేస్తున్నాం. ఇందన ధరలు తగ్గించేందుకు ప్రజా ఉద్యమాన్ని చేపడతాం" అని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా: జిన్‌పింగ్‌ సన్నిహితుడు ‘లైంగిక సంబంధం పెట్టుకోమని బలవంతం చేశారు’ - చైనా టెన్నిస్ స్టార్ ఆరోపణ