హీరోయిన్ల అందాన్ని వర్ణించిన రాయ్ లక్ష్మీ (Video)

గురువారం, 7 మార్చి 2019 (09:14 IST)
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఐటమ్ గర్ల్ లక్ష్మీరాయ్ నటిస్తున్న తాజా చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. 
 
'పాప అత్తిలి పాప', 'నాలో ఏం జరుగుతోంది' అనే పాటలను యూట్యూబ్‌లో రిలీజ్ చేయగా, ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా రాయ్ లక్ష్మీ మరో అందమైన పాటతో అందరిని అలరిస్తోంది. 'రారా వేణు గోప బాలా.. రాధిక వచ్చెను నిను చేరా' అంటూ సాగే మూడో పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది.
 
టాలీవుడ్‌లోని హీరోయిన్లతో రాయ్ లక్ష్మీని పోలుస్తూ పాడే ఈ పాట అందరిని అలరిస్తోంది. సురేశ్ బనిశెట్టి రాసిన ఈ పాటను హరి గౌర కంపోజ్ చేశారు. కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రవీణ్, మధు నందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తలపై పువ్వులు చల్లుకుని స్టార్ట్ అంటూ స్వాతి నాయుడు శోభనం లైవ్ వీడియో...