నిత్యం ఏదో ఒక అంశంపై ట్వీట్ చేస్తూ వార్తల్లో ఉండే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ ఉ.కొరియా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పక్షంలో ప్రపంచం చూడబోయే తొలి లేడీ విలన్ ఆమెనంటూ తాజాగా ట్వీట్ చేశారు. ఇపుడు ప్రముఖ పాప్ సింగర్, కొలంబియా దేశానికి చెందిన షకీరాను లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు. లాక్‌డౌన్‌కు ముందు ఈమె ఇచ్చిన ప్రదర్శనే మానవజాతి ఉనికికి ముగింపు వేడుక అని గుర్తించలేక పోయామని పేర్కొన్నారు.
అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్ ఫైనల్ ఈవెంట్ అయిన 'సూపర్ బౌల్ 2020' టోర్నీ ప్రారంభోత్సవంలో షకీరా ప్రదర్శన ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత కరోనా వ్యాప్తి పెరగడంతో చాలా దేశాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో షకీరా ప్రదర్శనకు, కరోనా వైరస్‌కు ముడిపెడుతూ రాంగోపాల్ వర్మ తాజాగా ట్వీట్ చేశారు. 'మనం ఎంత బుద్ధి తక్కువ వాళ్లం అంటే, లాక్‌డౌన్‌కు ముందు షకీరా ఇచ్చిన సూపర్ బౌల్ 2020 చివరి ప్రదర్శనే మానవ జాతి ఉనికికి ముగింపు వేడుక అని గుర్తించలేకపోయాం' అంటూ ట్వీట్ చేశారు. సూపర్ బౌల్ ప్రారంభ వేడుకల్లో షకీర నృత్య ప్రదర్శన వీడియోను కూడా షేర్ చేశారు.
వరల్డ్ ఫస్ట్ లేడీ విలన్...
ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ అయినట్టు, ఆయన స్థానంలో ఆయన సోదరి కిమ్ యో జొంగ్ దేశాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని తెలుగు సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రతి ఒక్కరికీ అర్థమైనట్టే ఉన్నప్పటికీ అందులో నిగూడార్థం ఉంటుంది. ఇపుడు వర్మ చేసిన ట్వీట్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.
'కిమ్ జొంగ్ ఉన్ చనిపోయాడనీ, అతని స్థానంలో ఆయన సోదరి అధికారం చేపట్టనుందనే వార్తలు వింటున్నాను. ఆమె అతనికంటే అత్యంత కిరాతకమైన వ్యక్తి అని అంటున్నాను. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ప్రపంచం మొత్తం ఫస్ట్ లేడీ విలన్‌ని చూస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జేమ్స్‌బాండ్ సినిమా రియల్ కాబోతోంది' అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ వెనుక ఉన్న అర్థం ఏమిటో అర్థమయ్యే ఉంటుందిగా.