Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిండు మనసుతో అందరి హృదయాలను దోచుకున్న హీరోయిన్

Advertiesment
Pranitha
, సోమవారం, 27 ఏప్రియల్ 2020 (13:54 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్ దెబ్బకు ప్రతి రంగం మూతపడింది. ఫలితంగా అనేక మంది పేద కూలీలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలుగా ఆదుకుంటున్నాయి. అలాగే, పలు స్వచ్చంధ సంస్థలు, ఎన్జీవోలు, పలు సంక్షేమ సంఘాలు వివిధ రకాలుగా సేవ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ ప్రణీత సుభాష్ కూడా తనవంతు సేవ చేసింది. ఈమె నిండు మనసుతో చేసిన పనికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. 
 
నిజానికి అనేక మంది సెలెబ్రిటీలు తమ ఇళ్ళలో ఉంటూ ఇంటి పనులు చేస్తూ వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఆడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాకుండా, అనేక మంది సెలెబ్రిటీలు రవ్వంత సాయం చేసి గోరంత ప్రచారం పొందుతున్నారు. 
 
కానీ, ఈ హీరోయిన్ మాత్రం కొండంతసాయం చేసింది. కానీ, ఈ విషయం బయటకు చెప్పుకోలేదు. ఇప్పటికే ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రణీత... లాక్‌డౌన్ కష్టాలు మరింత పెరిగాక పేదలను ఆదుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగింది. స్వయంగా భోజనం వండిస్తూ వాటిని పంపిణీ చేయిస్తోంది.
webdunia
 
గత 21 రోజుల్లో ఏకంగా 75 వేల మందికి భోజనం పెట్టింది. ప్రణీత మంచితనం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆమె నిజమైన సెలబ్రిటీ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీల నుంచి సమాజానికి కావాల్సింది పిల్లో ఛాలెంజ్‌లు, రియల్ మేన్ ఛాలెంజ్‌లు కాదు.. ప్రణితలా నిండు మనసుతో చేసే ఫుడ్ ఛాలెంజ్ కావాలని కామెంట్లు చేస్తున్నారు.
 
కాగా, ప్రణీత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" అనే చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా వైపు తప్పు ఉంది.. అందుకే నోరు మూసుకుని కూర్చొన్నా : కనికా కపూర్