Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రిష్‌గారికి `అర్ధ శతాబ్దం` క‌థ న‌చ్చి స‌పోర్ట్ చేశారుః ద‌ర్శ‌క నిర్మాత‌లు

Advertiesment
ArthaSatabdam
, సోమవారం, 15 మార్చి 2021 (19:49 IST)
Ravendra pulle, Radha krishna, chiti kiran
జాతీ, మత, వర్ణ వివక్ష కు వ్యతిరేకంగా, ప్రేమ కోసం జరిగే పోరాటంగా రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో 2003 లో జరిగిన కథే "అర్ధ శతాబ్దం". రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణలు నిర్మిస్తున్న చిత్రం 'అర్ధ శతాబ్దం'.ఈ చిత్రం మార్చి 26 నుంచి 'ఆహా' లో  వరల్డ్ ప్రీమియర్ గా స్ట్రీమ్ కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.
 
ఈ సందర్భంగా దర్శకుడు రవీంద్ర పుల్లే మాట్లాడుతూ.. పెద్ద డైరెక్టర్ అయిన క్రిష్ గారికి మా కథ నచ్చడంతో ఆయన మా సినిమా కాన్సెప్ట్ పోస్టర్ను రిలీజ్ చేయడంతో మా సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది. కార్తీక్ కు రానా గారు బర్త్ డే విషెస్ తెలపడం. ప్రముఖ దర్శకుడు సుకుమార్ పుష్ప షూట్ లో బిజీగా ఉన్నా మా టీంతో టైం స్పెండ్ చేసి మా చిత్రం గురించి తెలుసుకుని టీజర్ ను  లాంచ్ చేయడం జరిగింది. రకుల్ ప్రీత్ గారు ఒక సాంగ్ లాంచ్ చేశారు. ఇలా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ మా సినిమాకు సపోర్ట్ గా నిలిచారు వారందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు.ఈ "అర్ధశతాబ్దం" సినిమా 1950 నుండి 2003 వరకు జరుగుతుంది. ఇండియన్ డెమాక్రసీ మాములు పబ్లిక్ పై ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది దాన్ని ఎలా అర్థం చేసుకుని యుటిలైజ్ చేసుకుంటున్నాం. అలాగే దాని ఎలా మిస్ యూజ్ చేసుకొంటున్నాం అనే కథాంశంతో అద్భుతమైన లవ్ స్టొరీ ని జోడించి  సినిమాను తెరకెక్కించడం జరిగింది. నిర్మాతల సపోర్టుతో చిత్రాన్ని పూర్తి చేసి చిత్ర టీజర్ ను విడుదల చేశాము. ఆహా వారికి మా మా టీజర్  నచ్చడంతో ఈ సినిమాను ఆహాలో విడుదల చేయమని ఆఫర్ రావడంతో ప్రస్తుతం  ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మా అర్ధశతాబ్దం సినిమాను మార్చి 26 నుంచి  వరల్డ్ ప్రీమియర్ గా  100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా  విడుదల చేస్తున్నామని అన్నారు.
 
నిర్మాత చిట్టి కిరణ్ మాట్లాడుతూ.. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో  ఈ నెల 26వ తేదీన వస్తున్న మా "అర్ధ శతాబ్దం" చిత్రాన్ని ఆదరించి మాకు సపోర్ట్ నిలిస్తే మరిన్ని చిత్రాలు నిర్మిస్తామని అన్నారు
 
నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ,  షూటింగ్ మొదలు పెట్టిన తరువాత నాకు ఈ కథ చెప్పడం జరిగింది. ఈ కథ నచ్చడంతో నిర్మాతగా వారితో కలసి నిర్మించడం జరిగింది.సినిమా పూర్తి అయిన తరువాత థియేటర్స్ లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశాము. అయితే కరోనా టైంలో థియేటర్స్ బంద్ ఉన్న టైం లో మేము ఎలా వెళ్ళాలి అనుకున్న ప్యాండమిక్ స్విచ్వేషన్ లో ఆహా నుండి కాల్ వచ్చింది.ఆహా నుండి వచ్చిన ఆఫర్ ను మిస్ చేసుకోకుండా ప్రస్తుతం జనాల్లోకి వెళ్లేలా ఆహా లో విడుదల చేస్తే మరిన్ని చిత్రాలు నిర్మించవచ్చని ఈనెల 26న ఆహాలో విడుదల చేస్తున్నాం. అందరు మా సినిమాను చూసి  ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు.
కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్‌, కృష్ణ ప్రియ, సుహాస్‌, పవిత్ర లోకేష్‌, అజయ్‌, శుభలేఖ సుధాకర్‌, రాజా రవీంద్ర, రామ రాజుచ దిల్‌ రమేష్, టీఎన్‌ఆర్‌, శరణ్య, నవీన్‌ రెడ్డి, ఆమని నటీనటులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడోను ప్రేమించ‌డం త‌ప్పుకాదుః లావణ్య త్రిపాఠి