Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాల్దీవుల్లో ఫ్యామిలీతో కేజీఎఫ్ స్టార్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Advertiesment
మాల్దీవుల్లో ఫ్యామిలీతో కేజీఎఫ్ స్టార్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
, బుధవారం, 20 జనవరి 2021 (18:28 IST)
yash
కేజీఎఫ్ సీక్వల్‌గా రాబోతున్న కేజీఎఫ్-2లో నటిస్తున్నారు యశ్. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. గ‌రుడ‌ని హ‌త్య చేసి న‌రాచిలో తన సామ్రాజ్యాన్ని రాఖీ భాయ్ ఎలా బిల్డ్ చేసుకున్నాడు? ఎలా న‌రాచీకి కింగ్‌గా మారాడ‌న్న అంశాల నేప‌థ్యంలో ఈ ‘కెజిఎఫ్-2’ రూపొందిస్తున్నారు. 
 
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భారీ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవీనా టండన్‌ కీలకపాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఈ మూవీ ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి.
 
సినిమాల సంగతి పక్కనబెడితే నిజ జీవితంలో మంచి ఫ్యామిలీ‌మెన్‌గా ఉంటూ తన కుటుంబానికి మొదటి ప్రాధాన్యతనిచ్చే ఆయన.. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా భార్యాపిల్లలతో సరదాగా గడుపుతుంటారు. 
webdunia
yash
 
ఈ క్రమంలోనే తాజాగా ఫ్యామీతో మాల్దీవ్ ట్రిప్ వేసిన యశ్ అక్కడి అందమైన ప్రదేశాలను చుట్టేస్తున్నారు. భార్య, తన ఇద్దరు పిల్లలతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న రాఖీ భాయ్‌.. ఈ టూర్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రారంభమైన మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం