శింబుతో మానాడులో కీర్తి సురేష్.. శశికుమార్‌కు నో..
నటనపరంగా కీర్తి సురేష్ మంచి మార్కులు సంపాదించుకుంది. తమిళంలో స్టార్ హీరోల సరసన ఆమె చేసిన సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శశికుమార్ హీరోగా ప్రభాకరన్ దర్శకత్
నటనపరంగా కీర్తి సురేష్ మంచి మార్కులు సంపాదించుకుంది. తమిళంలో స్టార్ హీరోల సరసన ఆమె చేసిన సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శశికుమార్ హీరోగా ప్రభాకరన్ దర్శకత్వంలో ఆమె ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సినిమాలో తాను నటించట్లేదని కీర్తి సురేష్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు ప్రాజెక్టులో చేయడానికి అంగీకరించడమేననే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కీర్తి సురేశ్ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉందట. అందుకే కీర్తి సురేష్ శశికుమార్ సినిమాకి కాకుండా వెంకట్ ప్రభు సినిమాకి డేట్స్ ఇచ్చిందని అంటున్నారు.
మహానటి ఘన విజయం అందాల తార కీర్తి సురేష్ క్రేజ్ పెంచేసింది. ఆ చిత్రం తర్వాత కీర్తి సురేష్ కోసం దక్షిణాది నిర్మాతలు క్యూ కడుతున్నారట. ప్రస్తుతం విక్రమ్‌తో జతకట్టి కీర్తి సురేష్ నటించిన సామి స్వ్కేర్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో శింబుతో మానాడు చిత్రంలో, శశికుమార్‌తో కొంబు వెచ్చ సింగం అనే చిత్రంలో నటించమని కీర్తికి ఆఫర్లు వచ్చాయని తెలుస్తోంది. కానీ శశికుమార్ సినిమాను కీర్తి వద్దనుకుందట.