Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త అవతారమెత్తిన హీరోయిన్ కీర్తి సురేష్

Advertiesment
keerty suresh
, గురువారం, 23 నవంబరు 2023 (18:15 IST)
చిత్రసీమలో 'మహానటి'గా గుర్తింపు పొందిన కీర్తి సురేశ్.. ఇపుడు కొత్త అవతారమెత్తారు. కేరళ ఉమెన్స్ క్రికెట్ సంఘం తరపున ఆమె ప్రచారంకర్త (బ్రాండ్ అంబాసిడర్)గా నియమితులయ్యారు. దీంత ఈ నెల 26వ తేదీన తిరువనంతపురం వేదికగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే రెండో టీ20 మ్యాచ్ కోసం టిక్కెట్ల అమ్మకాన్ని ప్రారంభించారు. టిక్కెట్ అమ్మకాల ప్రారంభం తర్వాత కీర్తి సురేశ్ కేరళ మహిళా క్రికెటర్లతో ముచ్చటించారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. దీనిపై కీర్తి సురేష్ సోషల్ మీడియాలో స్పందించారు. 
 
భవిష్యత్ మహిళా క్రికెట్ తారలు వీళ్లేనంటూ కొనియాడారు. ఇటువంటి ప్రతిభావంతులైన, హుజారైన మహిళా క్రికెటర్లను కలుసుకోవడం ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. కేరళ రాష్ట్ర గర్వించదగిన క్రికెటర్ మిన్ను మణతో ముచ్చటించానని తెలిపారు. త్వరలో జరిగే గురువారం నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‍లో భాగంగా, రెండో మ్యాచ్ టిక్కెట్లను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా, కేరళ క్రికెట్ అసోసియేషన్‌కు సౌహార్ద్ర రాయబారిగా వ్యవహిస్తుండటం తనకు దక్కిన విశేష గౌరవంగా భావిస్తానని కీర్తి సురేష్ పేర్కొన్నారు. 
 
ఆరేళ్లుగా 142 మంది విద్యార్థినిలపై ప్రిన్సిపాల్ అత్యాచారం... 
 
హర్యానా రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఆరేళ్లుగా విద్యార్థినిలపై ప్రిన్సిపాల్ అత్యాచారం చేస్తున్నాడు. ఈ కామాంధుడైన ప్రిన్సిపాల్ చేతిలో ఏకంగా 142 మంది విద్యార్థినిలు అత్యాచారానికి గురయ్యారు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థినులే ఆరోపిస్తున్నారు. తాజాగా వెలుగులోకి రాగా, పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. 
 
హర్యానా రాష్ట్రంలోని జింద్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలో దాదాపు 390 విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 15 మంది విద్యార్థినులు తమపై ప్రిన్సిపల్ చేస్తోన్న అఘాయిత్యాల గురించి వివరిస్తూ గత ఆగస్టు నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌లకు లేఖలు రాశారు. 
 
అల్గే, సెప్టెంబరు నెలలో హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ వారి లేఖను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని జింద్ పోలీసులకు సూచించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా లైంగిక వేధింపులు వాస్తవమేనని తేలడంతో నవంబర్ 4న ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతనికి జ్యూడీషియల్ కస్టడీ విధించింది. 
 
ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడానికి మొదట 60 మంది విద్యార్థినులు ముందుకొచ్చారని, ఇప్పుడు ఆ సంఖ్య 142కి చేరిందని మహిళా కమిషన్ పేర్కొంది. ప్రిన్సిపాల్‌పై త్వరలో చార్జిషీట్‌ తెరవనున్నట్లు పోలీసులు తెలిపారు. నవంబరు 16వ తేదీన అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీప్తి గార్గ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశామని, విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజినీకాంత్, కమల్ హాసన్ 21 సంవత్సరాల అపూర్వ కలయిక ఎక్కడో తెలుసా!