Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోదావరిలో కార్తికేయ, నేహా శెట్టిల రొమాంటిక్ గీతం వెన్నెల్లో ఆడపిల్ల

Karthikeya and Neha Shetty
, మంగళవారం, 7 మార్చి 2023 (15:25 IST)
Karthikeya and Neha Shetty
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన సినిమా 'బెదురులంక 2012'. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో కార్తికేయ సరసన 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు. 'వెన్నెల్లో ఆడపిల్ల... కవ్వించే కన్నెపిల్ల... అంటూ సాగే గీతాన్ని ఈరోజు విడుదల చేశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీ అందించిన ఈ 'వెన్నెల్లో ఆడపిల్ల...' పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. హారిక నారాయణ్, జెవి సుధాంశు ఆలపించారు. లెజెండరీ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు.
 
'వెన్నెల్లో ఆడపిల్ల...' లిరికల్ వీడియోలో కార్తికేయ, నేహా శెట్టిల కెమిస్ట్రీ అందంగా ఉంది. ప్రేమికుల మధ్య రొమాంటిక్ మూమెంట్స్, ఫీలింగ్స్ చక్కగా ఆవిష్కరించారు.
 
చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ "మణిశర్మ అద్భుతమైన బాణీ అందించారు. ప్రేమ కథలోని కీలకమైన సందర్భంలో వస్తుందీ పాట. మణిశర్మ గారి బాణీకి తోడు కార్తికేయ, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ, కెమెరా వర్క్ పాటలో హైలైట్ అవుతాయి. 'వెన్నెల్లో ఆడపిల్ల...' పాట విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. గోదావరి తీర ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ పాటను చిత్రీకరించాం. ఎనిమిది ఎకరాల రొయ్యల చెరువు మధ్య రాత్రి వేళల్లో తీసిన పాట ఇది. సినిమాలో హీరో హీరోయిన్ల జోడి చాలా ఫ్రెష్ గా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ సినిమాకి హైలైట్. అలాగే, కామెడీ కూడా! ఇది హిలేరియస్ ఎంటర్టైనర్. ఎంటర్టైనర్ ఆఫ్ థిస్ సీజన్ అని గర్వంగా చెబుతాం. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఉంటుంది. గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే 'బెదురులంక 2012' ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు వినోదాత్మకంగా, వైవిధ్యంగా ఉన్నాయి అని ప్రేక్షకులు చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం. డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. బిజినెస్ క్రేజీగా జరుగుతోంది" అని చెప్పారు.
 
కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్తులు కూడబెట్టకపోయినా అభిమానాన్ని సంపాదించుకొన్నాను : ఎం.ఎం. శ్రీ లేఖ