Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కడుపులో కత్తెర పెట్టి మరిచిపోయి అలానే కుట్లు వేశారు..

operation
, సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (10:51 IST)
పెద్దపల్లిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళా రోగికి కష్టాలు తప్పలేదు. ఆరేళ్ల క్రితం డెలివరీ కోసం వెళ్లిన ఓ మహిళకు ఆపరేషన్ చేసిన ఓ డాక్టర్.. బిడ్డను తీసి కడుపులో కత్తెర పెట్టి మర్చిపోయారు. కడుపులో కత్తిని వుంచి అలానే కుట్లు వేశారు. 
 
అప్పటి నుంచి బాధితురాలు కడుపునొప్పితో బాధపడుతోంది. ఎంతకు తగ్గకపోవడంతో హైదరాబాదులోని ఓ ఆస్పత్రికి వెళ్లిన బాధితురాలికి విస్తుపోయే విషయాలు తెలిశాయి. స్కానింగ్ రిపోర్టులో కడుపులో కత్తి ఉన్నట్లు తెలియడంతో ఆ మహిళ అవాక్కైంది. 
 
వివరాల్లోకి వెళితే... మంచిర్యాలకు చెందిన ఓ మహిళ మొదటికాన్పు కోసం గోదావరిఖనిలోని తన పుట్టింటికి వచ్చింది. నొప్పులు వస్తుంటే కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక మార్కండేయ కాలనీలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంకు వెళ్లింది. డాక్టర్ అబ్జర్వేషన్‌లో వుండాలనుకోవడంతో 2017 ఏప్రిల్ 15న ఆస్పత్రిలో చేరింది. 
 
మరుసటిరోజు సీనియర్‌ గైనకాలజిస్టు సిజేరియన్‌ ద్వారా మగబిడ్డకు పురుడు పోశారు. సిజేరియన్‌ చేస్తున్న సమయంలోనే మహిళ కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లు వేశారు. మొదటి కాన్పు జరిగి ఆరేళ్లయినా గర్భం అందలేదు. 
 
కడుపునొప్పితో తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో.. రెండు రోజులు క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చూపించుకుంది. అక్కడి డాక్టర్ ఎక్స్‌రే తీయించుకోమని సూచించారు. ఆసమయంలోనే కత్తెర ఉందన్న విషయం ఆ మహిళకు తెలిసింది. 
 
బాధితురాలికి జరిగిన దారుణంపై కుటుంబ సభ్యులు సిజేరియన్‌ చేసిన గైనకాలజిస్టును నిలదీశారు. రాజీ కుదరడంతో ఆపరేషన్‌ కోసం రూ.3.50 లక్షలు చెల్లిస్తానని వైద్యులు చెప్పారు. ఈ సమస్య సద్దుమణిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంసెట్‌‍లో వెయిటేజీ మార్కులు శాశ్వతంగా రద్దు.. తెలంగాణ సర్కారు నిర్ణయం?