కమల్ హాసన్ కాలికి శస్త్ర చికిత్స చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దాని నుంచి కోలుకుని ప్రజల మధ్యకు ఎప్పుడెప్పుడు రావాలని ఆశగా వుందని అంటున్నారు. ఇందుకు డాక్టర్లకు థ్యాంక్స్ చెప్పారు. ఈ నెల 19న, కమల్ హాసన్ తన కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
2016లో, కమల్ హాసన్ చెన్నైలోని తన నివాసంలో నడుస్తూ నడుస్తూ పడిపోయినప్పుడు కాలికి దెబ్బ తగిలింది. తరువాత అతను కాలు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. శస్త్ర చికిత్స విజయవంతమైందని ఆయన కుమార్తెలు శ్రుతి, అక్షర అప్పుడు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే తాజాగా మరోసారి నొప్పి బాధించడంతో శస్త్ర చికిత్స చేయించుకున్న కమల్ తన ట్విటర్ ద్వారా వైద్యులకి స్పెషల్ థాంక్స్ తెలిపారు.
కమల్ మాట్లాడుతూ "నా కాలికి శస్త్రచికిత్స విజయవంతమైంది. శ్రీ రామచంద్ర ఆసుపత్రిలోని వైద్యుల బృందానికి కృతజ్ఞతలు. నేను కోలుకునే వరకు, ప్రజల హృదయాలలో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ప్రజల ప్రేమ నాకు మందు, నేను త్వరగా కోలుకొని మళ్ళి మధ్యకు వస్తాను అంటూ కమల్ తమిళంలో ట్విట్ చేసారు.