పాన్-ఇండియా స్టార్స్ ప్రభాస్, దీపికా పదుకొనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. 2024లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి లెజెండరీ నటుడు-చిత్రనిర్మాత కమల్ హాసన్ ప్రాజెక్ట్ కె మేకర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ సినిమా మేకర్స్ ఇటీవల కమల్‌ను సంప్రదించి, సినిమాలో ప్రధాన విలన్‌గా నటించమని అభ్యర్థించారు.
రానున్న రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ప్రాజెక్ట్ కె మేకర్స్ కమల్ కాల్ షీట్స్ నుండి కేవలం 20 రోజులు పొందడానికి భారీ రెమ్యూనరేషన్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.
ఈ చిత్రంలో ప్రముఖ హిందీ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు.