Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదిపురుష్ నుంచి హార్ట్ టచింగ్ సాంగ్ రామ్ సీతా రామ్

Advertiesment
Prabhas, Kritisanan
, సోమవారం, 29 మే 2023 (16:31 IST)
Prabhas, Kritisanan
ఇండియాస్ మోస్ట్ అవెటెడ్ మూవీ ఆదిపురుష్ నుంచి అద్భుతమైన పాట విడుదలైంది. రాఘవ్, జానకిల మంత్రముగ్ధులను చేసే కథతో మనల్ని ఆదిపురుష్‌ ఆకర్షించబోతోంది. సీతారాములుగా ప్రభాస్, కృతి సనన్‌ ద్వయం మెస్మరైజింగ్ గా పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్న ఈ చిత్రం నుంచి రాఘవ్, జానకిల ప్రేమలోని గాఢతను తెలియజేసేలా సాగే మెలోడియస్ జర్నీ 'రామ్ సీతా రామ్' పాట పూర్తి ట్రాక్ ను విడుదల చేసింది మూవీ టీమ్.
 
సచేత్-పరంపర స్వరపరచిన ఈ గీతం  మధురమైన స్వరాలతో నెమ్మదిగా సాగుతూ హృదయాలను తాకేలా ఉంది. 
 
రామ జోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం.. సీతారాముల మధ్య పంచుకున్న లోతైన అనుబంధాన్ని స్పష్టంగా చిత్రీకరిస్తుంది. పాట ప్రారంభంలోనే, ఇది సీతారాముల జీవితంలో వారి బంధం ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది. నిజమైన ప్రేమ యొక్క శాశ్వతమైన శక్తిని, మానవ భావోద్వేగాల యొక్క శాశ్వతమైన లోతును ఈ పాట గుర్తుచేస్తుంది.
 
మంత్రముగ్ధులను చేసే సంగీతం మరియు మనోహరమైన గాత్రాలకు అతీతంగా, శ్రావ్యమైన ట్రాక్ ప్రభు శ్రీరామ్ మరియు సీతమ్మ గుణగణాలను వర్ణిస్తూ, వారి ధర్మాన్ని, కరుణ మరియు దైవిక దయను హైలైట్ చేస్తూ, మంత్రముగ్ధులను చేసే ఆదిపురుష్ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకువెళుతుంది.
 
2023లో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాలా వరకూ సినిమాలు రెండోసారి చూడను కానీ... : నిర్మాత సతీష్ వర్మ