Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

Advertiesment
NTR wishesss fans

దేవీ

, శనివారం, 12 ఏప్రియల్ 2025 (20:52 IST)
NTR wishesss fans
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ రూపొందించిన 'అర్జున్ S/O వైజయంతి' సినిమాకి U/A సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. నేడు హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్.టి.ఆర్. హాజరయ్యారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మదర్ అండ్ సన్ డ్రామా తో రూపొందింది.
 
webdunia
Kalyanram, vijayasanthi, ntr
ఎన్.టి.ఆర్. మాట్లాడుతూ, కర్తవ్యంలో పోలీస్ ఆపీస్ కు కొడుకుపుడితే అక్కడనుంచే అర్జున్.. సినిమా ప్రారంభం అవుతుందనిపిస్తుంది. ఇదే స్టేజీపై నాన్నగారితో కలిసి మాట్లాడిన సందర్భాలున్నాయి. ఆలోటును విజయశాంతిగారు తీర్చారు. భారతదేశంలో ఎవరినీ దక్కని  నటిగా విజయశాంతిగారికి దక్కింది. కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు కానీ ఆమె చేసిన ప్రతి సినిమా భిన్నమైంది. ఇక ఈ సినిమాలో ఆఖరి 20 నిముషాలు ప్రేక్షకుడిని కన్నీళ్ళు తెప్పిస్తాయి. ఈ సినిమా చూశాను. ఈ సినిమాతో అన్న కళ్యాణ్ కాలర్ ఎగరేస్తాడు. అన్న కెరీర్ లో మైలురాయిలా నిలుస్తుంది. విజయశాంతిగారు లేకపోతే అలా నటన చేసేవాడు కాదేమోనని అనిపించింది. నాన్నగారు వున్నప్పుడు మరో జన్మ వుంటే మళ్ళీ కొడుకుగా పుడతానని చెప్పారు. ఇప్పుడు మీరే నా అభిమానులు. త్వరలో మరలా కలుద్దాం. నందమూరి అభిమానులు అంటే ఓర్పు సహనంగా వుండాలి అన్నారు.
 
కొత్త సినిమా గురించి
 
ప్రశాంత్ నీల్ సినిమాకంటే ముందు ఏప్రిల్ లో అన్న సినిమా విడుదలవుతుంది. ఇక ఆగస్టు లో వార్ 2 మూవీ రిలీజ్ కాబోతుంది. చాలా అద్భుతంగా వచ్చింది. ఆ విషయాలు త్వరలో మాట్లాడడానికి మీముందుకు మరోసారి వస్తాను అన్నారు.
 
విజయ శాంతి మాట్లాడుతూ, నన్ను సినిమా చేయాలని అడుగుతున్నారు. సరిలేరు నీకెవ్వరూ చేశాను అన్నాను.కానీ చాలామంది సరిపోదు  మాకు అని నన్ను అడిగారు. అందుకే కథ బాగుండాలి. హీరో కుదరాలి. అనుకున్నాను. ఓ రోజు దర్శకుడు వచ్చి కళ్యాణ్ సినిమా గురించి చెప్పాను. నా ఫ్యాన్స్ కు అనుగుణంగా కావాలంటే కొన్ని మార్పులు చేయాలన్నారు. అందుకు వారు అంగీకరించారు. అక్కడ నుంచి కథ ఓ కొలిక్కి వచ్చింది. అశోక్, సునీల్ నిర్మాతలుగా సినిమా చేశారు. మనసుపెట్టి సినిమా చేశాం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకున్నాను.

ఇక ఎడిటర్ రూమ్ నుంచి తమ్మిరాజుగారు చెప్పిన మాట సక్సెస్ అవుతుందని గట్టిగా అనిపించింది. క్లయిమాక్స్ లో ఏడిపించారు. అందరికీ కనెక్ట్ అవుతుందని సెన్సార్ వారు కూడా చెప్పారు. ఈ సినిమాను తల్లులకు అంకితం చేస్తున్నాం. సీనియర్ ఎన్.టి.ఆర్. నుంచి మనం చాలా నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నాను. ఇక జూనియర్ ఎన్.టి.ఆర్. మంచి మనసున్న నటుడు, కష్టపడి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళారు. అభిమానుల ఉత్సాహం ఆయన్న మరో మెట్టు ఎదిగేలా చేస్తుంది అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా