ఏప్రిల్ 15 నుండి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలతో భారత రైల్వే తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ సమయాలను సవరించిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది.
అటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరింది. ఏసీ లేదా నాన్-ఏసీ తరగతులకు ప్రస్తుత తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ బుకింగ్ షెడ్యూల్‌లలో ఎటువంటి మార్పులు చేయలేదని ఇది ధృవీకరించింది.
ఏప్రిల్ 15 నుండి కొత్త తత్కాల్ బుకింగ్ సమయాలు అమలు చేయబడతాయని సూచించే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని ప్రస్తావిస్తూ, ఫోటో పూర్తిగా ఫేక్ అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏజెంట్లు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి అనుమతించబడిన సమయాల్లో కూడా ఎటువంటి మార్పులు లేవని ఆ ప్రకటన తేల్చి చెప్పింది. ప్రస్తుత నియమాలు పూర్తిగా అమలులో ఉన్నాయి. అటువంటి సమాచారం కోసం అధికారిక సమాచారాన్ని అందించే ప్రకటనలపై మాత్రమే ఆధారపడాలని ప్రజలకు సూచించారు.