Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కల్కి లో కథలేదు - ప్రేక్షకులు నిద్రపోతున్నారు. అంతా ఫేక్ పబ్లిసిటీనే !

Nag aswin, prabhas latest

డీవీ

, గురువారం, 11 జులై 2024 (16:22 IST)
Nag aswin, prabhas latest
బాహుబలి, ఒక కథ వుంది, కథనం వుంది.  సలార్, కు కొద్దో గొప్ప వుంది. కానీ కల్కీ కి ఏవీ లేవు. సిల్లీగా ఏది బడితే అది రాసుకుని సినిమా తీశాడు నాగ్ అశ్విన్ అని సీనియర్ దర్శకుడు గీతా క్రిష్ణ విశ్లేషించారు.
 
కల్కి గ్రాస్ వందల కోట్లు వచ్చిందని పబ్లిసిటీ చేశారు. కానీ నిర్మాతకు ఏమీ రాలేదు. స్వప్నా దత్ ఫేక్ పబ్లిసిటీ చేసుకుంటుంది. ఇది పాన్ ఇండియా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు సినిమా ఆగిపో్యిందన్నారు. డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టామన్నారు. 
 
ఇక అమితాబ్, కమల్ హాసన్.. డేట్స్ కూడా రెండు రోజుల్లో తీసేయవచ్చు. ఈ సినిమా చూశాక  పరమ చెత్త సినిమాలా వుందని సీనియర్ రచయిత, దర్శకుడు గీతా క్రిష్ణ తేల్చిచెప్పారు.
 
ముప్పై ఏళ్ళ నాడే రఫ్ డ్..వెహికల్స్.. హాలీవుడ్ లో వచ్చేశాయి. చిరంజీవి కూడా కొన్ని సినిమాలు చేశాడు. ఇక హాలీవుడ్ స్టార్ వార్స్ ప్రభావంతో దర్శకుడు కథ ఏమిటో తెలియకుండా, ఎవరినీ సంప్రదించకుండా తనకిష్టమైన కథగా రాసేసుకున్నాడు. ఆయన ఇంటర్వూ  ఇటీవలే చూశాను. దేనికీ సరైన సమాధానం చెప్పపలేదు. పబ్లిసిటీ పిచ్చి తప్ప ఇంకేమీ కాదు.
 
అలాగే ఎడిటింగ్ చాలా బేడ్ గా వుంది. కథనం సరిగ్గా లేదు. మొదటి భాగం చూడగానే నిద్రపోతున్నారు ప్రేక్షకులు అని గీతా క్రిష్ణ స్పష్టం చేశారు.
 
చాలా థియేటర్లలో వారం రోజుల తర్వాత ప్రేక్షకులే సగం మంది వుండడం విశేషం. కానీ వెయ్యి కోట్ల రాబడుతుందని చెత్త పబ్లిసిటీ చేస్తున్నారని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకటేష్, అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్ ప్రారంభం, సంక్రాంతికి రిలీజ్