Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'కళింగ’ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్

kalinga movie

మురళి

, మంగళవారం, 9 జులై 2024 (17:04 IST)
ప్రస్తుతం ఆడియెన్స్ టేస్ట్ మారిపోయింది. రొటీన్ మాస్ మసాలా కమర్షియల్స్ కంటే కంటెంట్, కాన్సెప్ట్ సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో సూపర్‌ హిట్ ‘కిరోసిన్’ ఫేమ్ ధృవ వాయు మరో కొత్త కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో రాబోతున్నారు. ధృవ వాయు ఈ ‘కళింగ’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్ మీద దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
 
లెజెండరీ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. కళింగ అనే టైటిల్‌, ఫస్ట్ లుక్ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది.
 
పోస్టర్‌లో హీరో, అతని వెనకాల లక్ష్మీ నరసింహా స్వామి ఉగ్ర రూపంలో ఉన్న విగ్రహం, హీరో చేతిలోని ఆ కాగడ.. మొత్తం ఆ సెటప్‌ను చూస్తుంటే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇవ్వబోతోందని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తేనే అర్థం అవుతోంది.
 
ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తుండగా, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్షయ్ రామ్ పొడిశెట్టి సినిమాటోగ్రఫీని, విష్ణు శేఖర, అనంత నారాయణన్ ఎజి సంగీతం అందిస్తున్నారు. నరేష్ వేణువంక ఎడిటర్.
 
తారాగణం: ధృవ వాయు, ప్రజ్ఞా నయన్, అడుకలం నరేన్, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి, షిజు ఏఆర్, సమ్మెట గాంధీ, బలగం సుధాకర్, సంజయ్ కృష్ణ, హరిశ్చంద్ర తదితరులు
 
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: ధృవ వాయు
నిర్మాతలు: దీప్తి కొండవీటి, పృథివి యాదవ్
బ్యానర్: బిగ్ హిట్ ప్రొడక్షన్స్ 
DOP: అక్షయ్ రామ్ పొడిశెట్టి 
సంగీతం: విష్ణు శేఖర మరియు అనంత నారాయణన్ AG
ఎడిటర్: నరేష్ వేణువంక
DI: ఆర్యన్ మౌళి
డాల్బీ మిక్స్: Sp నారాయణన్
SFX: షఫీ
PRO: సాయి సతీష్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే మంచి సందేశాత్మక చిత్రం ‘భారతీయుడు 2’: కమల్ హాసన్