Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో హనీమూన్ ఎక్స్ ప్రెస్ : చిత్ర యూనిట్

Chaitanya Rao  Hebba Patel,

డీవీ

, గురువారం, 13 జూన్ 2024 (20:30 IST)
Chaitanya Rao Hebba Patel,
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "హనీమూన్ ఎక్స్ ప్రెస్". ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
 
దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ - దర్శకుడు బాల రాజశేఖరునితో నాకు మంచి మిత్రుడు. ఆయన హాలీవుడ్ లో బ్లైండ్ యాంబిషన్, గ్రీన్ కార్డ్ ఫీవర్ అనే మూవీస్ చేశాడు. ఇప్పుడు టాలీవుడ్ కు వచ్చి హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా రూపొందించారు. హీరో చైతన్య రావ్ నాకు మంచి ఫ్రెండ్. ఈ మూవీకి కల్యాణి మాలిక్ మంచి సాంగ్స్ ఇచ్చారు. ఈ నెల 21న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాను మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
 
webdunia
Honeymoon Express prerelease
దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ - నేను యూఎస్ లో ఉన్నప్పుడు మా ఫేవరేట్ డైరెక్టర్స్ ను ఈమెయిల్స్ ద్వారా సంప్రదించేవాడిని. అలా డైరెక్టర్ బాల గారిని అప్రోచ్ అయ్యాను. ఆయన మూవీకి పనిచేయాలని ఉందని అడిగాను. బాల గారు రూపొందించిన బ్లైండ్ యాంబిషన్ సినిమాకు ఒక షెడ్యూల్ అయ్యాక జాయిన్ అయ్యాను. అలా నేను ఫస్ట్ నేను వర్క్ చేసిన మూవీ ఆయనదే. స్క్రిప్ట్ రైటింగ్ లో మంచి బుక్స్ ను బాల నాకు సజెస్ట్ చేసేవారు. అలా స్క్రిప్ట్ రైటింగ్ లోనూ అవగాహన తెచ్చుకున్నా. బాల తెలుగులో తన తొలి సినిమాను హనీమూన్ ఎక్స్ ప్రెస్ పేరుతో చేయడం సంతోషంగా ఉంది. నేను మొదట్లో దర్శకుడిగా సినిమా చేసేప్పుడు ఆయన సలహాలు తీసుకునేవాడిని. బాల గారి ఫస్ట్ తెలుగు సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ, . ఈ సినిమాతో ఎగ్జైటింగ్, ఇంట్రెస్టింగ్ జర్నీ చేశాము. ఈ నెల 21న హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా రిలీజ్ కు వస్తోంది. మీరంతా థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ, మా మూవీకి నాగార్జున, అమల, రాఘవేంద్రరావు, ఆర్జీవీ, విజయేంద్రప్రసాద్ .ఇలా చాలామంది సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మనదేశం నుంచి దూరంగా ఉంటూ రావడం వల్ల ఇక్కడి ప్రజలను, కల్చర్ ను మిస్ అయ్యాను. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా నేను తిరిగి మన దగ్గరకు వచ్చేందుకు ఒక వెహికిల్ లా ఉపయోగపడింది. స్టార్ హోటల్స్ లో మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవచ్చు కానీ నేను ప్రసాద్ ల్యాబ్స్ నే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా లెగసీని కొనసాగిస్తున్న ప్లేస్. ఇక్కడే వేలాది సినిమాలు తయారయ్యాయి. ఆ చరిత్రలో మా హనీమూన్ సినిమా కూడా భాగమవ్వాలనే ప్రసాద్ ల్యాబ్స్ ను మా సినిమా ప్రీ రిలీజ్ వేడుక చేస్తున్నాం. ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా రూపొందించాం. 30 వెడ్స్ 21 చైతన్య రావ్ ను, కుమారి 21 ఎఫ్ హెబ్బా పటేల్ ను జంటగా ఈ మూవీలో చూపించడమే ప్రత్యేకత. చైతన్య రావ్ కు, హెబ్బా పటేల్ కు డిఫరెంట్ ఇమేజ్ లు ఉన్నాయి. వారి జంట ఈ మూవీలో ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తుంది. వంద కోట్ల సినిమా అయినా పది కోట్ల రూపాయల సినిమా అయినా కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు. అప్పట్లో టైటానిక్ మూవీతో పాటు ది ఫుల్ మాంటీ అనే స్మాల్ బడ్జెట్ మూవీ రిలీజైంది. టైటానిక్ సినిమాను ఎంతమంది చూశారో, అంతే సంఖ్యలో ప్రేక్షకులు ది ఫుల్ మాంటీ చూశారు. కానీ లాభాలు ది ఫుల్ మాంటీ సినిమాకే ఎక్కువ వచ్చాయి. టైటానిక్ మేకర్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. థియేటర్ లోకి వెళ్లాక ఒక ప్రేక్షకుడిని మెప్పించేది కంటెంట్ మాత్రమే. అలాంటి మంచి కంటెంట్ మా హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీలో ఉంది.  అన్నారు.
 
రైటర్ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ - హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ జంట చైతన్య రావ్, హెబ్బా పటేల్ బాగున్నారు. దర్శకుడు బాల మంచి డైరెక్టర్. హాలీవుడ్ లో మూవీస్ చేశాడు. ఇప్పుడు తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు. అతనితో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
 
హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ - ప్రతి నటుడికి అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలనే కోరిక ఉంటుంది. నాకు అలాంటి అవకాశం హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా దక్కింది. దర్శకుడు బాల గారిలో హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఉంటుంది. ఈ సినిమాలోనూ అది కనిపిస్తుంది. డైరెక్టర్ బాల ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడే హ్యాపీగా ఫీలయ్యా. లవర్స్, పెళ్లి చేసుకోబోయే వాళ్లు, పెళ్లి చేసుకున్నకొత్త జంట, పెళ్లై ఇరవై ఏళ్లయిన జంటలు ప్రతి ఒక్కరికీ నచ్చేలా హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఉంటుంది. వాళ్లందరికీ రిలేట్ అయ్యే అంశాలుంటాయి. అలాగని ఈ సినిమాలో సందేశం చెప్పడం లేదు. ఎంటర్ టైనింగ్ గా సినిమాను రూపొందించారు మా దర్శకుడు.ఈ నెల 21న హనీమూన్ ఎక్స్ ప్రెస్ థియేటర్స్ లోకి వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోలీవుడ్‌లో విషాదం : 'మహారాజ' నటుడు ప్రదీప్ కన్నుమూత