టాలీవుడ్ హీరో, నిర్మాత కల్యాణ్ రామ్ ఆదివారం తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలను తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్‌ను పెట్టారు.
కల్యాణ్ రామ్ తనకు అన్నకంటే ఎక్కువని అన్నారు. "నాకు అన్నయ్యగా మాత్రమే కాదు. అంతకంటే ఎక్కవ. నాకు స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్త కూడా. నువ్వు నిజంగా అందరికన్నా బెస్ట్. హ్యాపీ బర్త్ డే కల్యాణ్ అన్నా' అంటూ ట్వీట్ చేశాడు.
కాగా, గతంలో ఎన్టీఆర్ హీరోగా, కల్యాణ్ రామ్ 'జై లవకుశ' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న చిత్రంలోనూ భాగమయ్యాడు. ప్రస్తుతం మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ చిత్రంలో కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నాడు. అతని పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.