Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

'అమ్మ' చికిత్స కోసమే ఎర్రచందనం స్మగ్లింగ్ : 'జబర్దస్త్' కమెడియన్

ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో 'జబర్ధస్త్' కమెడియన్ హరిబాబును పోలీసులు అరెస్టు చేశారు. శేషాచలం అడవుల నుంచి దొంగచాటుగా ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లతో కలిసి తరలిస్తున్నట్టు పోలీసులకు పక్కా ఆధారాలు లభి

Advertiesment
Jabardasth comedian
, మంగళవారం, 17 జులై 2018 (19:22 IST)
ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో 'జబర్ధస్త్' కమెడియన్ హరిబాబును పోలీసులు అరెస్టు చేశారు. శేషాచలం అడవుల నుంచి దొంగచాటుగా ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లతో కలిసి తరలిస్తున్నట్టు పోలీసులకు పక్కా ఆధారాలు లభించడంతో హరిబాబును అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనపై వివిధ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
ఆ తర్వాత ఆయన వద్ద జరిపిన విచారణలో అనేక విషయాలను వెల్లడించారు. తన తల్లి అనారోగ్యానికి గురికావడంతో ఆమె వైద్యానికి డబ్బులు లేక, మరో గత్యంతరం లేక ఒకే ఒక్కసారి ఎర్రచందనం స్మగ్లింగ్ చేశానని చెప్పాడు. అదేసమయంలో తనపై 20 కేసులు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని హరిబాబు చెప్పాడు. తిరుపతి ట్రాఫిక్ పోలీస్ విభాగంలో పని చేసే ఓ కానిస్టేబుల్ నాపై కక్ష కట్టి.. ఈ కేసుల్లో ఇరికించినట్లు చెబుతున్నాడు. 
 
గతంలో టాస్క్‌ఫోర్స్ విభాగంలో పనిచేసి.. ఇటీవలే ట్రాఫిక్ విభాగానికి బదిలీ అయిన ఆ కానిస్టేబుల్ తనపై కక్ష సాధించడం కోసమే తనను ఈ కేసులో ఇరికించాడని ఆరోపించాడు. అయితే, పోలీసుల వాదన మాత్రం మరోలా ఉంది. కొన్ని సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న హరిబాబుపై 10 పోలీస్‌ స్టేషన్లలో.. 13 కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఓసారి పట్టుబడినట్లు కూడా చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త‌మిళ హీరోతో సినిమా చేస్తోన్న‌ శేఖ‌ర్ క‌మ్ముల..!