Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ‌యంత్ సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో `న‌రేంద్ర`... హీరోయిన్‌గా ప్ర‌ముఖ మోడ‌ల్

Advertiesment
జ‌యంత్ సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో `న‌రేంద్ర`... హీరోయిన్‌గా ప్ర‌ముఖ మోడ‌ల్
, సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (20:24 IST)
ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావ‌గారూ బాగున్నారా, శంక‌ర్ దాదా ఎం.బి.బి.ఎస్‌, ల‌క్ష్మీన‌ర‌సింహ‌.. వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల డైరెక్ట‌ర్ జ‌యంత్‌.సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో ఈషాన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ నిర్మాణంలో నిలేష్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `న‌రేంద్ర‌`. ఈ చిత్రంలో ప్ర‌ముఖ మోడ‌ల్ ఇజా బెల్లె హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్ప‌టికే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ మార్చి 10 నుండి హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది. 
 
ఈ సంద‌ర్భంగా వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ జ‌యంత్ సి.ప‌రాన్జీ మాట్లాడుతూ – “నిలేష్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో.. చాంపియ‌న్‌గా ఎదిగిన ఓ బాక్స‌ర్ క‌థాంశంతో తెరెక్కుతోన్న మా `న‌రేంద్ర` ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది. కొత్త షెడ్యూల్ మార్చి 10 నుండి ప్రారంభం కానుంది.

వ‌ర‌ల్డ్ రెజ్లింగ్‌లో మ‌న దేశం త‌ర‌పున స‌త్తా చాటుతున్న స్టార్ రెజ్ల‌ర్ గ్రేట్ కాళీ ఈ చిత్రంలో న‌టిస్తుండం విశేషం. అలాగే ప్ర‌ముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ రామ్ సంప‌త్ కూడా ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్ర‌ముఖ మోడ‌ల్ ఇజా బెల్లె హీరోయిన్‌గా న‌టిస్తుంది. సినిమాను అనుకున్న ప్ర‌ణాళిక‌లో తెర‌కెక్కిస్తున్నాం. అన్నీ ఎమోష‌న్స్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమా ఉంటుంది“ అన్నారు.
 
హీరోయిన్ ఇజా బెల్లా మాట్లాడుతూ – “జ‌యంత్ వంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌గారితో ప‌నిచేయ‌డం హ్య‌పీగా ఉంది. చాలా ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాను. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌“ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ... 118 అంటే ఏమిటి అని అనుకుంటున్నారు.. అందుకే... కళ్యాణ్‌ రామ్‌ ఇంటర్వ్యూ