Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కామెడీ చేసే నటులు దొరకడం ఇంకా కష్టం : సుందరకాండ డైరెక్టర్ వెంకటేష్

Advertiesment
Nara rohit, Keerthana Vaidyanathan

దేవీ

, శనివారం, 23 ఆగస్టు 2025 (18:53 IST)
Nara rohit, Keerthana Vaidyanathan
నారా రోహిత్ 20వ మూవీ 'సుందరకాండ'. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు. వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్ గా నటించారు. ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి పలు విషయాలు తెలిపారు.
 
ఈ సినిమా నుండి డియర్ ఐరా సాంగ్ ని రిలీజ్ చేశారు. లియాన్ జేమ్స్ డియర్ ఐరా ని బ్యూటీఫుల్ లవ్ సాంగ్ గా కంపోజ్ చేశారు. శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ లీడ్ పెయిర్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి. లియోన్ జేమ్స్, కీర్తన వైద్యనాథన్ వోకల్స్ సాంగ్ ని మరింత లవ్లీగా మార్చాయి. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా వుంది. ఈ సాంగ్ ఇన్స్టంట్ గా కనెక్ట్ అయి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.  
 
-నాకు ఫ్యామిలీ కథలు ఇష్టం. కలిసుందాం రా నా ఫేవరెట్ సినిమా. అలాంటి ఒక క్యూట్ ఫ్యామిలీ స్టోరీ చేయాలని ఉండేది.
-రోహిత్ గారితో నాకు ఎనిమిదేళ్ల  జర్నీ వుంది. నా ఫస్ట్ సినిమాని క్యూట్ ఫ్యామిలీ లవ్ స్టోరీ గా చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఈ ఆలోచన వచ్చింది. రోహిత్ గారికి చెప్పాను. కథ రాసి పంపించాను. ఆయన చదివి ఇంప్రెస్ అయ్యారు. అలా ప్రాజెక్టు మొదలైంది.
 
- హీరో క్యారెక్టర్ రాయడానికి ఇన్స్పిరేషన్ ఉంది. 30 దాటాక పెళ్లి కాకపోవడమే పెద్ద పంచాయతీ అనుకుంటే, ప్రత్యేకమైన క్వాలిటీలు వెతుక్కోనే  పర్సన్ ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందనేదనే ఆలోచన నుంచి వచ్చింది.
 
-పవన్ సాధినేని గారి దగ్గర ఒక వెబ్ సిరీస్ చేశాను. సాగర్ కే చంద్ర, పల్నాటి సూర్య ప్రతాప్ గారి దగ్గర రైటింగ్ లో చేశాను. వీర భోగ వసంతరాయులు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గాపని చేశాను. అలాగే నేల టికెట్ సినిమాకి అప్రెంటిస్ గా చేశాను.  
 
-రామాయణంలో హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరికి వెళ్లి రాముల వారిచ్చిన ఉంగరాన్ని చూపించే ఘట్టం సుందరకాండ. అదొక సెలబ్రేషన్. అయితే సెలబ్రేషన్ కి ముందు ఎన్నో సవాళ్లు వున్నాయి. హనుమంతులవారు ఎన్నో ఎఫర్ట్స్ పెట్టారు. అలా మా హీరో కూడా ఒక విషయాన్ని ఎచీవ్ చేయాలనుకుంటారు. దానికి ఆయన పెట్టే ఎఫెర్ట్స్ ఎమిటనేది కథ. అలా సుందరకాండ అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఇది పాజిటివ్ టైటిల్. రామాయణం నాకు చాలా ఇష్టం. ఆ టైటిల్ కూడా అలా కలిసి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
 
-నాకు కామెడీ చాలా ఇష్టం. అయితే రాయడం అంత ఈజీ కాదు. వీటన్నిటికంటే కామెడీ చేసే నటులు దొరకడం ఇంకా కష్టం. లక్కీగా మాకు చాలా అద్భుతమైన నటులు దొరికారు.
 
-సత్య గారు సునయన క్యారెక్టర్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సత్య గారిది కేవలం కామెడీ అని కాకుండా ఈ కథలో చాలా కీలకమైన పాత్రగా ఉంటుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్ లో ఫన్ ఉంటుంది. ఫ్యామిలీ అందరితో కలిసి చాలా హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలీని కథతో అందరినీ ఆకట్టుకునేలా వుండేదే త్రిబాణధారి బార్బరిక్ : దర్శకుడు మోహన్ శ్రీవత్స