Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలీని కథతో అందరినీ ఆకట్టుకునేలా వుండేదే త్రిబాణధారి బార్బరిక్ : దర్శకుడు మోహన్ శ్రీవత్స

Advertiesment
Director Mohan Srivatsa

దేవీ

, శనివారం, 23 ఆగస్టు 2025 (18:39 IST)
Director Mohan Srivatsa
బార్బరికుడు త్రిబాణంతో కురుక్షేత్రంను ఆపగలరు. అలాంటి బార్బరికుడిని కృష్ణుడు ఓ వరం అడిగి యుద్దాన్ని జరిగేలా చేస్తారు. నార్త్‌లో బార్బరికుడు ఫాలోయింగ్ చాలా ఉంటుంది. సత్య రాజ్ గారు బార్బరికుడిలా కొన్ని చోట్ల కనిపిస్తారు. మేకప్‌ విషయంలో ఆయనను చాలా కష్టపెట్టాను. కథను నిర్మాతకు చెప్పిన వెంటనే నచ్చింది. మారుతి గారు నా కథను విని ఆశ్చర్యపోయారు. నా నెరేషన్‌తోనే ఆయన నన్ను నమ్మేశారు అని త్రిబాణధారి బార్బరిక్ దర్శకుడు మోహన్ శ్రీవత్స అన్నారు.
 
డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీలో సత్య రాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ మూవీ ఆగస్ట్ 29న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ఇప్పటికే అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. ఈ మేరకు దర్శకుడు మోహన్ శ్రీవత్స చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
 
- నేను సంగీతాన్ని నేర్చుకున్నా కూడా.. నాకు సినిమాలోకి రావాలని, దర్శకుడు కావాలన్నదే నా కల. ఎన్నో ఈవెంట్లలో పాటలు కూడా పాడేవాడిని. అదే నాకు ఇన్ని రోజులు తిండి పెట్టింది. నేను కథల్ని బాగా చెప్పగలను. అద్భుతంగా నెరేషన్ ఇవ్వగలను.
 
- మారుతి గారి జానర్‌లో ఉండే సినిమా కాదిది. కానీ ఈ కథను నేను పర్‌ఫెక్ట్‌గా నెరేట్ చేశాను. ఆ తరువాత యాభై శాతం షూటింగ్ చేశాను. ‘మహారాజా’ స్క్రీన్ ప్లే, టెంప్లెట్‌లో ఈ మూవీ ఉంటుంది. ఆ మూవీ తరువాత మారుతి గారు మా ‘బార్బరిక్’ను ఎక్కువగా నమ్మారు.
 
- ‘రాజా సాబ్’ షూటింగ్‌లో మారుతి గారు బిజీగా ఉన్నా కూడా మా ‘బార్బరిక్’ మూవీ కోసం చాలా పని చేశారు. మాకు ఎన్నో ఇన్ పుట్స్ ఇచ్చారు. ఆయన సహకారం నేను ఎప్పుడూ మర్చిపోలేను.
 
- ‘బార్బరిక్’ కథలో చాలా లేయర్స్ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకే మైథలాజికల్ టచ్ ఇచ్చాను. ‘బార్బరిక్’ కంటెంట్ బేస్డ్ మూవీ. ఇందులోని ప్రతీ పాత్రకు భిన్న పార్శ్యాలు ఉంటాయి. సత్య రాజ్ గారు, ఉదయభాను గారు, వశిష్ట గారు ఇలా అందరూ అద్భుతంగా నటించారు.
 
- నాకు మ్యూజిక్ మీద టచ్ ఉంది. ఆ విషయంలో ఆడియెన్స్ పల్స్ నాకు తెలుసు. ఇన్ ఫ్యూజన్ బ్యాండ్‌తో నాకు మంచి బంధం ఉంది. మాకు అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆర్ఆర్ కూడా అదిరిపోతుంది. కొత్తగా ఉండాలనే ఇలా బ్యాండ్‌ని తీసుకున్నాను.
 
- ‘బార్బరిక్’ సబ్జెక్ట్‌కి తగ్గట్టుగా నిర్మాత విజయ్ పాల్ రెడ్డి గారికి ఓ బడ్జెట్ ఇచ్చాను. మారుతి గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మా నిర్మాత విజయ్ గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మాకు అండగా నిలిచారు.
 
- ‘బార్బరిక్’ చిత్రంలో హీరో, విలన్ అని ఉండరు. అన్ని పాత్రల్లో అన్ని యాంగిల్స్ ఉంటాయి. అన్ని పాత్రల్లోనూ అంతర్గిక యుద్దం జరుగుతుంటుంది. ఈ మూవీతో మంచి సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. తెలిసో తెలియకో అందరం తప్పులు చేస్తుంటాం. అన్ని ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకునే వాడు గొప్ప మనిషి అని చెప్పదల్చుకుంటున్నాను. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా అందరినీ అలరించేలా మా చిత్రం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Kavya Thapar: నేను రెడీ హీరోయిన్ కావ్య థాపర్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్