హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి భూముల అంశంపై బాలీవుడ్ నటి ఊశ్వరి రౌతేలా స్పందించారు. కంచి గచ్చిబౌలి భూములు ఉండే ప్రాంతం ఒక అభయారణ్యం మాత్రమే కాదని హైదరాబాద్ నగరానికి జీవం పోసే శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ అని వెల్లడించారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
"సీం రేవంత్ రెడ్డిగారూ... కంచి గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ఉన్న చెట్లు, అడవిని తొలగించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని నేను వేడుకుంటున్నా. ఇది అభయారణ్యమే కాదు.. మన నగరానికి జీవం పోసే శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ" అంటూ ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి పలువురు సినీ నటీనటులు విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేసిన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, నటి దియా మీర్జా, నటుడు జాన్ అబ్రహాంతో సహా పలువురు హీరోయిన్లు, ఇతర నటీనటులు స్పందించారు.