Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

Advertiesment
Sangeet Shobhan, Niharika Konidela, Manasa Sharma

దేవీ

, బుధవారం, 2 ఏప్రియల్ 2025 (16:04 IST)
Sangeet Shobhan, Niharika Konidela, Manasa Sharma
ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నటించిన నటీనటుల్లో ఎక్కువ మంది కొత్తవారే కావటం విశేషం.
 
తాజాగా నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రెండో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న  ప్రతిభావంతుడైన యువ కథానాయకుడు సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు రానున్న రోజుల్లో వెల్లడికానున్నాయి.
 
ఇది వరకే నిహారిక  రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు. జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా.. సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ రూపొందించనున్న ఈ సినిమాతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ఆంగేట్రం చేస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ప్రధాన పాత్రలో నటించారు.
 
ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి  (బియాండ్ మీడియా) పిఆర్వోగా, టికెట్ ఫ్యాక్టరీ మార్కెటింగ్ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)