ఉదయం నుంచి ఆదాయపు పన్నుశాఖ అధికారులు సినీ ప్రముఖుల ఇంటిలో సోదాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అందులోను ప్రముఖ నిర్మాత రామానాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్ కార్యాలయంలోను సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 25 మంది ఐటీ శాఖ అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నారు.
మరోవైపు అనూహ్యంగా ఐటీ శాఖ అధికారులు ప్రముఖ నటుడు నాని ఇంటిపైన సోదాలు ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లిహిల్స్ లోని నాని నివాసం, అలాగే ఆయనకు సంబంధించిన కార్యాలయాలపైన సోదాలు జరుపుతున్నారు.
నాని ఈ మధ్యకాలంలో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఐటీ రిటర్న్స్ సరిగ్గా చెల్లించలేదన్న ఆరోపణలు నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు సోదాలను కొనసాగిస్తున్నారు. కోట్ల రూపాయల డబ్బులను నాని ఇంటిలో స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 2 వేల నోట్లతో పాటు 500 రూపాయల నోట్లు కూడా సన్ సైడ్ మీద ఐటీ అధికారులు గుర్తించారట. ఎలాంటి రసీదులు లేని ఆ డబ్బును ఐటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.