Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెల రోజులుగా గోవాలో పూరీ కనెక్ట్స్ టీం... ఏం చేస్తున్నారు?

Advertiesment
నెల రోజులుగా గోవాలో పూరీ కనెక్ట్స్ టీం... ఏం చేస్తున్నారు?
, గురువారం, 28 మార్చి 2019 (18:45 IST)
ఎనర్జిటిక్ స్టార్ రామ్‌, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరో హీరోయిన్స్‌గా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ఈ సినిమా గోవా షెడ్యూల్ పూర్త‌య్యింది. నెల రోజులుగా గోవాలో ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంది. 
 
ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను, యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరో రామ్‌ను స‌రికొత్త కోణంలో చూపించ‌బోతున్నారు.
 
పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్ నిర్మాత‌లు మారి రూపొందిస్తున్న ఈ సినిమాను వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మే నెలాఖ‌రున లేదా జూన్ ఫ‌స్ట్ వీక్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''లక్ష్మీస్ ఎన్టీఆర్'' విడుదలకు బ్రేక్.. ఏప్రిల్ 15వరకు నో రిలీజ్