Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్లామ‌ర్ పాత్ర‌లైనా సిద్ధ‌మంటున్న ఈషా రెబ్బ‌!

Advertiesment
గ్లామ‌ర్ పాత్ర‌లైనా సిద్ధ‌మంటున్న ఈషా రెబ్బ‌!
, బుధవారం, 28 ఏప్రియల్ 2021 (20:14 IST)
Eesha (Photo : Instagram)
అచ్చ‌మైన తెలుగమ్మాయి ఈషారెబ్బ‌. ఎం.బి.ఏ చేసి సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా వుండేది. దాంతో  ఫేస్‌బుక్‌లో ఆమె చిత్రాలు చూసిన ద‌ర్శ‌కుడు ఇంద్రగంటి మోహన కృష్ణ అమెను `అంతకు ముందు... ఆ తరువాత` చిత్రంలో అవ‌కాశం క‌ల్పించారు. ఆ త‌ర్వాత అల్ల‌రి న‌రేశ్‌తో చేసిన బందిపోటు పెద్ద‌గా ఆడ‌లేదు. త‌న ప్ర‌తిభ‌ను ప‌రీక్షించుకోవ‌డానికి దాదాపు ఆ త‌ర్వాత తొమ్మిది చిత్రాల్లో న‌టించింది. క్రేజ్ రాలేదు. ఇప్పుడు క‌రోనా వేవ్ న‌డుస్తుంది. అందుకే మ‌రాలా త‌న‌ను తాను గ్లామ‌ర్‌గా మ‌లుచుకుంటూ ఇన్‌స్‌ట్రాగ్రామ్‌లో ఫొటోలు పెడుతుంది.
 
webdunia
Eesha (Photo : Instagram)
ఇప్ప‌టి తార‌ల‌కు త‌క్కువేవీకాద‌న్న‌ట్లు పొట్టి నిక్క‌ర్లు, స్లీవ్‌గౌన్‌లు వేసుకుని మైమ‌రిపిస్తోంది. ఎర్ర‌గా వుండే ఆమెను చూస్తే ఈసారి ఏ ద‌ర్శ‌కుడైనా ముందుకు వ‌స్తాడేమో చూడాలి. అవ‌కాశాల‌నేవి అదృష్టంతోపాటు వ‌స్తాయ‌ని తొలుత స్టేట్‌మెంట్ ఇచ్చిన ఈషా బేసిగ్గా తెలుగమ్మాయి కావడంతో ఈ భామకు మన దగ్గర అంత ఆదరణ రాలేమోన‌ని కొంద‌రు అంటుంటారు. కానీ అవేవీకాద‌ని తాను అన్ని పాత్ర‌ల‌కు సిద్ధ‌మ‌న్న‌ట్లు ఇస్తున్న ఈ ఫోజ్‌లు ఆమెకు అవ‌కాశాలు తెచ్చిపెడ‌తామో చూడాలి. ఆల్ ది బెస్ట్ ఈషా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్మశానంలో మొక్కలు నాటి, వాటికి ఎరువుగా వివేక్ అస్థికలు