Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస‌క్త‌కిరంగా శతఘ్ని ట్రైలర్

ఆస‌క్త‌కిరంగా శతఘ్ని ట్రైలర్
, శుక్రవారం, 21 మే 2021 (16:13 IST)
Satagni
కొత్త‌వారిలో చాలా ప్ర‌తిభ క‌న‌బ‌డుతుంది. చిన్న పాయింట్ తీసుకుని దాన్ని ఆస‌క్తిక‌రంగా వుండేలా చేయ‌డం విశేషం. `శ‌త‌ఘ్ని` ట్రైల‌ర్ అలానే వుంటుంది. నిర్మాత, హీరో దాసరి అభిరామ్ రెడ్డి చేసిన ఈ సినిమా ట్రైల‌ర్ ఆరంభంలోనే `అనుకున్నామ‌ని జ‌ర‌గ‌వ‌ని అన్ని అనుకోలేద‌ని ఆగ‌వు కొన్ని.. అంటూ రేడియో వ‌చ్చే పాట‌తో ఆరంభంమైది. త‌దుప‌రి బుచ్చ‌మ్మ అనే పేరు ను చూసి ఆ పేరంట నాకు ఇష్టం. ఆ పిల్లంటే నాకు ప్రాణం.. అని డైలాగ్‌లు చెబుతాడు హీరో.  ఆ త‌ర్వాత యాక్ష‌న్ స‌న్నివేశాలు అమ్మాయి గురించి ర‌క‌ర‌కాల వ్య‌క్తుల మ‌న‌స్త‌త్వాల‌ను విశ‌దీక‌రించాడు. చివ‌రికి బుజ్జ‌మ్మ ఏమ‌యింది? అనేది థ్రిల్లింగ్ గా చూపించాడు ద‌ర్శ‌కుడు.
 
వాట్ నెక్స్ట్ పిక్చర్స్ బ్యానర్ పై ఎల్. వి. శివ దర్శకత్వంలో అభిరామ్ రెడ్డి దాసరి హీరోగా, స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం  "శతఘ్ని".. 2010 లో ఆంధ్ర తీరప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో స్వాతి మండల్ హీరోయిన్ గా చేస్తుండగా, కంచరపాలెం ఫేమ్ సుబ్బారావు & కిషోర్, వైజాగ్ ధనరాజ్, కళ్యాణ్ కృష్ణ, సన్నీ, కరుణ్ కాంత్, కోలా మహేష్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.. హైదరాబాదీ మూవీస్ ఫేమ్ గుల్లు దాదా ఇందులో చాలా కీలకమైన పాత్రని పోషిస్తున్నారు. యాక్షన్-సస్పెన్స్-క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకోగా, రాం సుంకర ఫైట్స్ సత్య మాస్టర్ కోరియోగ్రఫీ ని అందించారు..  హర్ష ప్రవీణ్ సంగీతం సమకూరుస్తుండగా ఎం.డి. రఫీ సినిమాటోగ్రఫర్ గా , క్రాంతి (ఆర్. కె) ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, హీరో దాసరి అభిరామ్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా రూపొందించాం.. ఈ సినిమా ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.. కరోనా సమయంలో ఇబ్బంది పడే వారికి సహాయం చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తాం  ట్రైలర్ ఎంతో బాగుంది.  దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు.. ప్రతి ఆర్టిస్ట్ చాలా బాగా నటించారు అని తెలిపారు.
 
దర్శకుడు ఎల్.వి.శివ మాట్లాడుతూ,  ఈ సినిమా కి నిర్మాతగా, హీరోగా అభిరాం గారు అందించిన సహాయం మర్చిపోలేనిది.. మధుర ఆడియో ద్వారా విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.. కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల కొంత ఆలస్యమవుతుంది అన్నారు..  
 
నటీనటులు :దాసరి అభిరామ్ రెడ్డి, స్వాతి మండల్, కంచరపాలెం ఫేమ్ సుబ్బారావు & కిషోర్, వైజాగ్ ధనరాజ్, కళ్యాణ్ కృష్ణ, సన్నీ, కరుణ్ కాంత్, కోలా మహేష్ తదితరులు
 
సాంకేతిక నిపుణులు :
బ్యానర్: వాట్ నెక్స్ట్ పిక్చర్స్ 
నిర్మాత: అభిరాం రెడ్డి దాసరి 
దర్శకుడు: ఎల్.వి.శివ 
సంగీతం: హర్ష ప్రవీణ్
ఛాయాగ్రహణం: ఎం.డి. రఫీ
ఎడిటర్: క్రాంతి
డి.ఐ & కలరింగ్: కళ్యాణ్
వి.ఎఫ్.ఎక్స్: డి. లోకేష్ చౌదరి
స్టీరియో & 5.1 మిక్స్: తుమ్మల అభ్యుదయ్
పబ్లిసిటీ డిజైనర్: అజయ్ ఆర్ట్స్
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ అక్కగా జ్యోతిక.. రమ్యకృష్ణను అనుకున్నారు.. కానీ..?