Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినూత్నంగా నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌య్ కృష్ణా న‌రేశ్

Advertiesment
వినూత్నంగా నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌య్ కృష్ణా న‌రేశ్
, గురువారం, 31 డిశెంబరు 2020 (16:18 IST)
ప్ర‌ముఖ న‌టుడు డాక్ట‌ర్ అలీ నిర్మాత‌గా అలీవుడ్ ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై తెర‌కెక్కుతున్న సినిమా అంద‌రు బాగుండాలి అందులో నేనుండాలి. మ‌ళ‌యాలీ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా వికృతి ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో డాక్ట‌ర్ అలీతో పాటు ప్ర‌ముఖ న‌టులు డాక్ట‌ర్ విజ‌య‌కృష్ణ న‌రేశ్ కూడా ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. మౌర్యానీ హీరోయిన్ న‌టిస్తున్నారు.
 
ఈ చిత్రాన్ని శ్రీపురం కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో అంగ‌రంగ వైభవంగా మొద‌లైన ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారంగా ప్ర‌క‌టిస్తామ‌ని డాక్ట‌ర్ అలీ తెలిపారు. అలానే క‌రోనా నేప‌థ్యంతో 2020లో అతలాకుత‌ల‌మైన అంద‌రి జీవితాలు రాబోయే 2021లో కోలుకోవాల‌ని, ఈ కొత్త ఏడాది అంద‌రికి మంచి చేకూర్చాల‌ని కోరుకుంటూ డాక్ట‌ర్ విజ‌య‌కృష్ణ న‌రేశ్‌తో క‌లిసి అలీవుడ్ ఎంట‌ర్టైన్మెంట్స్, అంద‌రు బాగుండాలి అందులో నేనుండాలి చిత్ర బృందం త‌రుపున డాక్ట‌ర్ అలీ ప్రేక్ష‌కుల‌కి శుభ‌కాంక్ష‌లు తెలుపుతూ ఓ వీడియోని విడుద‌ల చేశారు.
 
ఈ వీడియో డాక్ట‌ర్ అలీ మాట‌ల‌తో శుభాకాంక్ష‌లు తెలిపితే, డాక్ట‌ర్ విజయకృష్ణ న‌రేశ్ సైగ‌ల ద్వారా న్యూఇయ‌ర్ విషెస్ అందించారు. ప్రస్తుతం ఈ వీడియోకి సోష‌ల్ మీడియాలో విశేషాద‌ర‌ణ ల‌భిస్తోంది. 
 
తారాగాణం 
డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌యకృష్ణ న‌రేశ్, మౌర్యానీ, ప‌విత్ర లోకేశ్ త‌దిత‌రులు
 
టెక్నీషియ‌న్లు
బ్యాన‌ర్ - అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత‌లు - అలీబాబ‌, కొనతాల మోహ‌న‌కుమార్
డిఓపి - ఎస్. ముర‌ళి మోహ‌న్ రెడ్డి
సంగీతం - రాకేశ్ ప‌ళిడ‌మ్
పాటలు - భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్
ఎడిట‌ర్ - సెల్వ‌కుమార్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ఇర్ఫాన్
ఆర్ట్ డైరెక్ట‌ర్ - కేవి ర‌మ‌ణ‌
మేక‌ప్ చీఫ్ - గంగాధ‌ర్
ర‌చన, ద‌ర్శ‌క‌త్వం - శ్రీపురం కిర‌ణ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్‌కు మెగాస్టార్ ట్యాగ్..? ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన ఆహా ఓటీటీ