Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెక్స్ట్ సినిమాకి వడ్డీతో సహా ఇచ్చేస్తాను : శ్రీవిష్ణు

Advertiesment
Sree Vishnu swag sucess kate cutting

డీవీ

, బుధవారం, 9 అక్టోబరు 2024 (13:53 IST)
Sree Vishnu swag sucess kate cutting
శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి లేటెస్ట్ కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ 'శ్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో పోషించారు. అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, విమర్శకులు ప్రశంసలు అందుకొని కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 
 
ఈ నేపధ్యంలో శ్రీవిష్ణు మాట్లాడుతూ,  కొన్ని సినిమాలు బాగున్నాయి అనిపిస్తాయి. ఇంకొన్ని సినిమాలు అంత లేదులే అనిపిస్తాయి. కానీ కొన్ని సినిమాలు చూసి వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతాయి. దాని గురించి ఒక డిస్కషన్ జరిగేలా చేస్తాయి. అలాంటి సినిమానే స్వాగ్. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. డిస్కషన్స్ నుంచి చాలా వాలిడ్  పాయింట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మేము ఫస్ట్ డే నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. సినిమా చూసినోళ్లు 90% సాటిస్ఫై అయ్యారు. 10% కొంచెం కాంప్లెక్స్ ఉంది అని ఫీల్ అయ్యారని హసిత్ చెప్పాడు. కొత్తగా ఏదైనా ప్రయత్నించినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు. దానికి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 
 
నేను చేసిన చాలా సినిమాలు కి ఇప్పటికీ ప్రశంసలు వస్తుంటాయి. ఆ సినిమా ప్రశంసలు ఆగిపోయి, ఈ సినిమా ప్రశంసలు మొదలవుతాయని ఆశిస్తున్నాను. ఈ ప్రశంసలు కొనసాగుతూనే ఉంటాయని నమ్ముతున్నాను. ఈ సినిమా చూసే కొద్ది కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో అర్థం అవుతుంది. ఇలాంటి రిస్కులు, కొత్త కథలు ట్రై చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ ని మనం ఇన్ స్పైర్ చేయలేం. ఏమీ లేని నాకు ఇంత గుర్తింపు ఇచ్చారు. తెలుగు ఆడియన్స్ రుణం తీర్చుకోవాలి. ఆ రుణం తీర్చే ప్రాసెస్లో ఇలాంటి గొప్ప కథలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. హసిత్ నా ఫ్యాన్. నాకు ఒక తమ్ముడిలా. నాకు ఇంత మంచి కథ, పాత్రలు రాసినందుకు థాంక్యూ. ఆడియన్స్ నేను చేసిన ప్రతి క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి రాస్తే దీన్ని కొట్టేది రాయాలి. రాస్తాడనే నమ్మకం కూడా ఉంది. విశ్వ గారు మాకు ఇంత ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇలాంటి కథను చేయలేం. పీపుల్ మీడియా టీమ్ అందరికీ థాంక్యు.  నెక్స్ట్ సినిమాకి వడ్డీతో సహా ఇచ్చేస్తాను. లేకపోతే లావు అయిపోతాను అన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లవ్ రెడ్డి సినిమా నుంచి కైలాష్ ఖేర్ పాడిన ఎమోషనల్ సాంగ్ ప్రాణం కన్నా.. రిలీజ్