Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భైరవగీతలో లిప్‌లాక్స్.. అలా నటించడం అస్సలు నాకు నచ్చలేదు..

Advertiesment
భైరవగీతలో లిప్‌లాక్స్..  అలా నటించడం అస్సలు నాకు నచ్చలేదు..
, సోమవారం, 19 నవంబరు 2018 (11:33 IST)
సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న ''భైరవగీత'' సినిమా రాయలసీమ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో లిప్ లాక్ సీన్లు మస్తుగా వున్నాయని విమర్శలు వస్తున్నాయి. దీనిపై వర్మ హీరోయిన్ స్పందించింది. తప్పనిసరి పరిస్థితుల్లో అలా నటించాల్సి వచ్చిందని.. ఈ సినిమాలో ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమను తెలియజేసేందుకు లిప్ లాక్ సీన్లు తప్పవని చెప్పింది.
 
వందలాది మంది మధ్య అలా నటించడం తనకు అస్సలు నచ్చలేదు. కానీ హీరోయిన్‌గా అది తన బాధ్యత అని భావించి అలాంటి సన్నివేశాల్లో నటించానని తెలిపింది. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో నవంబర్20వ తేదీన విడుదల కానుంది. 
 
కాగా భైరవ గీత అనే ఈ సినిమాను సిద్ధార్థ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. కన్నడ నటుడు ధనుంజయ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇర్రా మోర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ట్రైలర్లో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలే ప్రస్తుతం వివాదానికి దారితీశాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏం చేయను.. సంతకం పెట్టా... అందుకే పబ్లిక్‌లో లిప్‌లాక్ సీన్లు చేశా : ఇర్రా మోర్