బాలీవుడ్ చిత్ర రంగాన్ని మీటూ ఉద్యమం ఓ కుదుపుకుదుపుతోంది. తాజాగా మరో బాలీవుడ్ నటి కల్కి కొయెచ్లిన్ స్పందించింది. సినిమాల్లో సన్నిహిత సీన్లలో నటించే సమయంలో నటీనటులు ఒకరినొకరు విశ్వసించాలని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, షూటింగ్ స్పాట్‌లో ఉన్నపుడు దర్శకుడు చెప్పకుండా ఒక్క సీన్ కూడా తీయరన్నారు. అలాగే, పొరపాటున కూడా నటుడు ముఖంపై పంచ్ ఇవ్వరన్నారు. మరి సన్నిహిత సన్నివేశాల్లో అలా ఎందుకు జరగదని ప్రశ్నించింది. తాను చాలా సన్నివేశాల్లో నటుడుని చూడకుండానే నటించానని, అతడి పెదాలను కొరికానని గుర్తుచేసింది.
కానీ, అలాంటి సన్నివేశాలు అంతలా పండవని, ఆకట్టుకోదని చెప్పారు. ముఖ్యంగా, ఒక చిత్రంలో నటించే నటీనటుల మధ్య నమ్మకం ఉండాలని అభిప్రాయపడింది. ప్రస్తుతం తాను నటిస్తున్న ప్లేలో అత్యాచార సన్నివేశం ఉంటుందని, అందుకే ప్రతి రోజూ తన కోస్టార్‌తో ఈ సీన్ గురించి చర్చిస్తున్నాననీ, ఇలా చేయడం వల్ల నటించేటపుడు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని వివరించింది.