Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏ పనిచేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తానుః ఆలీ

Advertiesment
Andaroo bagundaali andtulo nenundaali
, శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:06 IST)
Naresh-Ali
నేను ఏ పనిచేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తాను. సెన్సార్‌ వారి ప్రశంసల తర్వాత ఈ సినిమా చేసే విషయంలో నా నిర్ణయం ఎప్పుడు తప్పు కాద‌ని అర్థమయింది` అని నటుడు, నిర్మాత ఆలీ అన్నారు. అలీ న‌టిస్తూ నిర్మించిన సినిమా ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. గతేడాది ఓటిటి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ అనే మలయాళ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు సెన్సార్ పూర్త‌యింది. వారి ప్ర‌శ‌సంలు ద‌క్కాయి. 
 
ఈ సంద‌ర్భంగా అలీ మాట్లాడుతూ, సూపర్‌స్టార్‌ కృష్ణగారు, ప్రభాస్, సోనూసుద్, సమంతాలు మా సినిమా ప్రమోషన్‌లో పాలు పంచుకుని నన్ను ఆశీర్వదించినందుకు వారికి నా ధన్యవాదాలు. త్వరలోనే సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ హీరోతో విడుదల చేయిస్తాం. అక్కడే సినిమా విడుదల తేదిని కూడా ప్రకటిస్తాను’’ అన్నారు. 
 
సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. నటునిగా ఆలీ దాదాపు 1100 చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రాకేశ్‌ పళిదంను ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నారు.
 
నిర్మాతల్లో ఒకరైన మోహన్‌ కొణతాల మాట్లాడుతూ, ఆలీ ఇన్ని రోజులు ఎందుకు ఆగమన్నారో సినిమా చూసిన తర్వాత నాకిప్పుడు అర్థమయ్యింది. ఇంత గొప్పసినిమా తీసే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నా’’ అన్నారు.పవిత్ర లోకేశ్, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరాం, మనో,  గౌతంరాజు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, ప్రణవి మానుకొండ , సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, ముక్తార్‌ ఖాన్,  భద్రం, లాస్య, సనా, వివేక్, శివారెడ్డి, సింగర్‌ మధు, గీతాసింగ్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి చీఫ్‌ క్రియేటివ్‌ హెడ్‌– ఇర్ఫాన్, కో డైరెక్టర్‌– ప్రణవానంద్‌  కెమెరా– ఎస్‌ మురళీమోహన్‌ రెడ్డి, ఆర్ట్‌– కెవి రమణ, డాన్స్‌ డైరెక్టర్‌– స్వర్ణ, ఎడిటర్‌– సెల్వకుమార్, ఫైట్స్‌–నందు, మేకప్‌–నంద్యాల గంగాధర్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌– సయ్యద్‌ తాజ్‌ బాషా, విఎఫ్‌ఎక్స్‌– మాయాబజార్‌ స్టూడియో

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగస్టు 27న 'సోని లివ్' ఓటీటీలో "వివాహ భోజనంబు" స్ట్రీమింగ్