Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆయ‌న్నుంచి చాలా నేర్చుకున్నా- సుష్మిత కొణిదెల

Advertiesment
ఆయ‌న్నుంచి చాలా నేర్చుకున్నా- సుష్మిత కొణిదెల
, సోమవారం, 27 డిశెంబరు 2021 (12:30 IST)
Rajendra Prasad, Sushmita Konidela, Vishnu Prasad,
ఆహా త్వరలోనే అచ్చమైన తెలుగు వెబ్‌ ఒరిజినల్‌ సినిమా ‘సేనాపతి’తో అలరించనుంది. ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్‌ ఓటీటీలో డెబ్యూ చేస్తున్న సినిమా ఇది. క్రైమ్‌ డ్రామా జోనర్‌లో సాగుతుంది. 'ప్రేమ ఇష్క్ కాదల్‌' ఫేమ్‌ పవన్‌ సాదినేని దర్శకత్వం వహించారు. సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందింది.  డిసెంబర్ 31న ఆహాలో సేనాపతి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. 
 
ఈ సందర్భంగా సుష్మిత కొణిదెల మాట్లాడుతూ ‘‘గోల్డ్ బాక్స్ నుంచి చేసిన ప్రతి ప్రాజెక్ట్‌కి కార‌ణం ప్రేక్ష‌కుల ఆశీర్వాదాలే కార‌ణ‌మ‌ని భావిస్తాం. సేనాప‌తి చిత్రాన్ని కూడా మీ అంద‌రికీ ఆశీర్వాదంతో ముందుకు తీసుకొస్తున్నాం. చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌గా ఉంది. ఆహాతో మేం కొలాబ్రేట్ అవుతున్న తొలి ప్రాజెక్ట్ ఇది. రాజేంద‌ప్ర‌సాద్ అంకుల్‌తో ఈ సినిమా చేయ‌డం చాలా స్పెష‌ల్‌గా అనిపించింది. సెట్స్‌లో ఆయ‌న డేడికేష‌న్‌, డిసిప్లెయిన్ చూసి చాలా నేర్చుకున్నాం. ప‌వ‌న్ సాధినేని మంచి సినిమాతో ప్రేక్ష‌కుల‌కు మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాడ‌ని నాకు న‌మ్మ‌కం ఉంది. త‌క్కువ టైమ్‌లో ఇంత మంచి ప్రొడ‌క్ట్ చేయ‌డానికి స‌పోర్ట్ చేసిన గోల్డ్ బాక్స్ టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు. 
 
అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘మా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండ‌స్ట్రీలో ఉన్నా కూడా, నిర్మాణ సంస్థ‌లు ఒక‌ట్రెండే ఉన్నాయి. ఇప్పుడు సుష్మిత కొణిదెల‌, విష్ణు వంటి వాళ్లు క‌లిసి గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ అనే ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను స్టార్ట్ చేయ‌డం చాలా ఆనందాన్ని ఇస్తుంది. కొత్త సినిమాల‌ను చేయ‌డానికి వీళ్లు ముందుకు రావ‌డం గొప్ప విష‌యం. వారి జ‌ర్నీ గొప్ప‌గా ఉండాల‌ని అంటున్నాను అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్‌లో ఐక్యత లేదు నిజమే.. నాని సంచలన వ్యాఖ్యలు