Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కల్కి చిత్రాన్ని చూడమన్నా నేను చూడలేదంటున్న హీరో రాజ‌శేఖ‌ర్...

Advertiesment
కల్కి చిత్రాన్ని చూడమన్నా నేను చూడలేదంటున్న హీరో రాజ‌శేఖ‌ర్...
, బుధవారం, 26 జూన్ 2019 (12:04 IST)
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'కల్కి'. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. 
 
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, 'హార్న్ ఓకే ప్లీజ్', 'ఎవరో ఎవరో' పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ నెల 28న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రశాంత్ వర్మ 'కల్కి' హానెస్ట్ ట్రైలర్ విడుదల చేశారు.
 
ఈ సంద‌ర్భంగా హీరో రాజశేఖర్ స్పందిస్తూ... ‘‘ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మ... నాకు సపోర్ట్‌గా ఇద్దరు సూపర్‌ డైరెక్టర్స్‌ ఉన్నారనే ఫీల్‌తో ఉన్నాను. ఇంతకు ముందు కోడి రామకృష్ణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, రవిరాజా పినిశెట్టి గారు... నాతో చాలా ఎక్కువ సినిమాలు చేశారు. నేను ఎప్పుడైనా కమర్షియల్‌గా కిందకు దిగితే వాళ్లు కాపాడతారనే విశ్వాసం, ధైర్యం ఉండేవి. ఇప్పుడు ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మతో ధైర్యం వచ్చింది. 
 
సి. కల్యాణ్ గారిని ఇంత కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా బిగినింగ్‌లో చూశా. ఈ మధ్య చూసింది లేదు. ఆయన సంతోషానికి కారణం ‘కల్కి’. నేనింకా సినిమా చూడలేదు. జస్ట్‌ మూడు రీళ్లు మాత్రమే చూశా. ఎందుకంటే... ఫీల్‌ ఎలా ఉందని! ఈ సినిమాలో నేను నటించినా... నెక్ట్స్‌ ఏం వస్తుందోననేది ఊహించలేకపోయా. పోనుపోను సూపర్‌గా ఉంటుంది. మా పిల్లలు ఫస్టాఫ్‌ వరకు చూడమన్నారు. నేను చూడలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. దీనంతటికీ కారణం ప్రవీణ్‌ సత్తారు గారు. 
 
ఆయన నాకు ఒక మార్క్‌ సెట్‌ చేశారు. క్లాస్‌లో మనం డిస్టింక్షన్‌లో పాస్‌ అయితే... తర్వాత ఆ మార్కుల కంటే తక్కువ వస్తే అందరూ తిడతారు. ‘గరుడవేగ’తో మమ్మల్ని ప్రవీణ్‌ సత్తారు గారు ఒక లెవల్‌లో పెట్టారు. ఇప్పుడు మేం ఆ లెవల్‌కి వెళ్లాలనేది మా అందరి టార్గెట్‌. మా మదర్‌ మరణించారనే బాధతో నేనోసారి బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకోలేదు. ప్రవీణ్‌ సత్తారు గారు నన్ను, మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ని వాళ్లింటికి పిలిచి సెలబ్రేట్‌ చేశారు. 
 
హోమ్‌ థియేటర్‌లో ‘గరుడవేగ’ ట్రైలర్‌ అందరికీ చూపించారు. అక్కడికి ప్రశాంత్‌ వర్మ కూడా వస్తే... ఆయన్ను పక్కకి తీసుకువెళ్లి ‘ప్రశాంత్‌! మనం ఈ ట్రైలర్‌ని బీట్‌ చేయాలి. నీ వల్ల కుదురుతుందా?’ అన్నాను. ప్రవీణ్‌ సత్తారు పెట్టిన టార్గెట్‌ని బీట్‌ చేయాలి లేదా రీచ్‌ అవ్వాలి అనే ఆలోచనతో కష్టపడి సినిమా చేశాం. రీచ్‌ అయ్యామనే అనుకుంటున్నాం. ‘గరుడవేగ’తో పోలిస్తే... ఇది డిఫరెంట్‌ ఫిల్మ్‌. కాకపోతే ఆ సినిమా చూసిన ఆడియన్స్‌కి ఖ‌చ్చితంగా ‘కల్కి’ శాటిష్‌ఫ్యాక్షన్‌ ఇస్తుందని చెప్పగలను. నా ప్రతి సినిమాకు జీవిత చాలా కష్టపడతారు. నేను కథ విన్నాక... క్యారెక్టర్‌ గురించి ఆలోచిస్తా. ప్రొడక్షన్‌ గురించి ఆలోచించను. 
 
జీవిత కష్టపడి కల్యాణ్‌గారు చెప్పిన బడ్జెట్‌లో సినిమాను పూర్తి చేశారు. అలాగే, ఈ సినిమాకు నాతో పాటు మా పిల్లలు కూడా కష్టపడ్డారు. చిరంజీవి గారితో వాళ్లబ్బాయి సినిమా ప్రొడ్యూస్‌ చేస్తున్నారని అనగానే... నాకు అబ్బాయి ఉంటే చేసేవాడని అనుకున్నా. మా అమ్మాయిలు ఇద్దరూ సూపర్‌గా చేశారు. ఐయామ్‌ వెరీ హ్యాపీ. ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మ నా నటనను కొత్తగా చూపించారు. యంగ్‌ జనరేషన్‌ దగ్గర బాగా వర్క్‌ చేయడం నేర్చుకున్నాను. యంగ్‌ జనరేషన్‌కి నేను చెప్పేది ఒక్కటే... మంచి సబ్జెక్ట్‌ ఉంటే రండి, సినిమా చేద్దాం. మనకు సూపర్‌ ప్రొడ్యూసర్‌ కల్యాణ్‌గారు ఉన్నారు. ‘కల్కి’ తర్వాత ‘గరుడవేగ 2’ చేస్తున్నా.’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాబాపై సేదతీరిన శ్రీరెడ్డి.. ఫోటో వైరల్