Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను మీకు ఎందుకు న‌చ్చుతున్నానో నాకు తెలియ‌డం లేదు... విజయ్ దేవరకొండ

Advertiesment
నేను మీకు ఎందుకు న‌చ్చుతున్నానో నాకు తెలియ‌డం లేదు... విజయ్ దేవరకొండ
, సోమవారం, 12 నవంబరు 2018 (17:42 IST)
టాక్సీవాలా ప్రి-రిలీజ్ ఈవెంట్లో హీరో విజ‌య‌ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వ‌చ్చిన బ‌న్నీ అన్న‌కి చాలా థ్యాంక్స్‌. పెళ్ళిచూపులు త‌ర్వాత న‌న్ను పిలిచి మాట్లాడారు. అర్జున్‌ రెడ్డి సినిమా చేసిన‌ప్పుడు కూడా గీతాఆర్ట్స్ ఆఫీస్‌కి పిలిచి డోర్ వేసి 20 నిమిషాలు మాట్లాడారు. గీత‌గోవిందం టైంలో కూడా నా ప‌క్క‌న కూర్చుని మాట్లాడారు. థ్యాంక్యూ అన్న నాకు మీరు ఇంత స‌పోర్ట్ అందిస్తున్నందుకు. నేను మొన్నమొన్నే వ‌చ్చా.

నేను చేసిన సినిమాలు వేళ్ళ‌పైన లెక్క‌పెట్ట‌వ‌చ్చు. బ‌న్నీ అన్న‌లాగా డాన్స్ నేను చెయ్య‌లేను. నేను మీకు ఎందుకు న‌చ్చుతున్నానో నాకు తెలియ‌డం లేదు. నేను చేసే సినిమాలు మీకు న‌చ్చి ఉంటాయి న‌న్ను ఇష్ట‌ప‌డ‌డానికి కార‌ణం. మ‌న‌కు ఉన్న‌ది మ‌న ధైర్యం, మ‌న క‌ష్టం. దాని పైనే పైకి రావొచ్చు. గీతాఆర్ట్స్ వాళ్ళు నాకు దారిని చూపించారు. ఎలాంటి సినిమాలు చెయ్యాల‌ని నాకు గైడెన్స్ ఇచ్చారు. 
 
విష్ణు నా ఫ్రెండ్ హాలీవుడ్ అనే రోల్ చేశాడు. చాలా బాగా చేశాడు. చాలా ఆఫ‌ర్స్ రావాల‌ని కోరుకుంటున్నాను. సాయి రైట‌ర్ మ‌నోడు. సినిమా స్టార్ట్ అయ్యేముందు పొలం అమ్మ‌కానికి పెట్టాడు. ప్రొడ‌క్ష‌న్ నుంచి డ‌బ్బులు రాగానే ప‌క్క‌న పెట్టాడు. సాయి గ్రేట్ రైట‌ర్. ప్రియాంక.. ఈమె అనంత‌పూర్ యాక్ట‌ర్ అవుదామ‌ని హైద‌రాబాద్ వ‌చ్చింది. ఆడిష‌న్స్‌కి ఇచ్చి మూవీకి సెలెక్ట్ అయింది. ఈ సినిమా కోసం సంవ‌త్స‌రంన‌ర నుంచి వెయిట్ చేస్తుంది. రాహుల్ కూడా ఇంజ‌నీరింగ్ చ‌దువుతూ ఫిలిం మేకింగ్ గురించి ఇంట‌ర్నెట్‌కి వెళ్లి మేకింగ్ గురించి చ‌దువుతూ నేర్చుకున్నాడు. చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఈ సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు త‌న కెరీర్ సెటిల్ కావాల‌ని కోరుకుంటున్నాను. 
 
సుజిత్ కెమెరామెన్ త‌ను నెక్ ప్రాబ్ల‌మ్‌తో ఉన్నాడు. నాకోసం బెల్ట్ వేసుకుని క‌ష్ట‌ప‌డి చేశారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. జేక్స్ వాళ్ళ ఫాద‌ర్ క్యాన్స‌ర్‌తో బాధప‌డుతున్నారు. అయినా చాలా క‌ష్ట‌ప‌డ్డారు. సినిమా అనేది ఒక ఎంట‌ర్‌టైన్మెంట్ కాని దాని వెన‌కాల చాలా మంది జీవితాలు ఉంటాయి. నేనెప్పుడూ ఎవ‌ర్నీ ఏమీ అడ‌గ‌లేదు. అంద‌రూ ఎంజాయ్ చేస్తారు. త‌ప్ప‌కుండా థియేట‌ర్స్‌కి వెళ్ళి చూడండి. ఎవ్వ‌రూ పైర‌సీ చెయ్య‌కండి ప్లీజ్ అంద‌రూ చూడండి. వంశీ అన్న‌, అర‌వింద్‌గారు మీ అంద‌రి స‌పోర్ట్‌కి థ్యాంక్యూ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటాషాతో డేటింగ్ చేస్తున్నా... యువ నటుడు వరుణ్ ధావన్