Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కల్యాణ్ సినిమా బ్యానర్లు కట్టేవాడిని... టాక్సీవాలా నిర్మాత

పవన్ కల్యాణ్ సినిమా బ్యానర్లు కట్టేవాడిని... టాక్సీవాలా నిర్మాత
, సోమవారం, 12 నవంబరు 2018 (16:14 IST)
టాక్సీవాలా చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్ చిత్ర ప్రి-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ... ముందుగా నేను ఈ స్టేజ్ మీద ఇలా ప్రొడ్యూస‌ర్‌గా ఉండ‌డానికి కార‌ణం గాడ్ ఫాద‌ర్ అల్లు అర‌వింద్‌ సార్‌. మాది ఏలూరు ఒక మెగా అభిమానిగా చిరంజీవి, ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ గారి సినిమాల‌కు బ్యాన‌ర్లు క‌ట్టే నేను అభిమానులంటే బ్యాన‌ర్లో పేరు వేచించే వాళ్ళే త‌ప్పించి నాలో టాలెంట్‌ని గుర్తించి ప్రొడ్యూస‌ర్‌గా చేయ‌డం ప్ర‌పంచంలోనే మొట్ట మొద‌టిసారి జ‌రిగింది. నేను మ‌న‌స్ఫూర్తిగా అల్లు అర‌వింద్‌గారికి సెల్యూట్ చేస్తున్నాను. నాకు ఈ అవ‌కాశం దొర‌క‌డం చాలా క‌ష్టం. వంశీ నన్ను ఎంక‌రేజ్ చేశారు. మారుతి ఎంతో బిజీగా ఉన్నా త‌ను ఒక మంచి క‌థ రాహుల్‌కి ఒక పాయింట్ చెప్పి నాకు ఇచ్చారు. సూప‌ర్ న్యాచ‌ర‌ల్ హై ఫై థ్రిల్ల‌ర్‌. ఇంత‌క ముందు ఎప్పుడూ రాని పాయింట్ ఎవ‌రూ తీయ‌లేదు. ఇండ‌స్ర్టీలో ఎవ‌రికీ ఊరిక‌నే సూప‌ర్ స్టార్ రాదు. వ‌రుస‌గా మూడు హ్యాట్రిక్లు కొట్టిన హీరో విజ‌య‌దేవ‌ర‌కొండ‌. ఇండ‌స్ర్టీని షేక్ చేసిన హీరో విజ‌య‌దేవ‌ర‌కొండ‌. ఆయ‌న మ‌మ్మ‌ల్ని న‌మ్మిన న‌మ్మ‌కం. 
 
ఈ సినిమా లీక్ అయినా మేం వీక్ కాలేదు. సో మేమేమి భ‌య‌ప‌డ‌టం లేదు. న‌వంబ‌ర్ 17న మీ అంద‌ర్నీ అల‌రిస్తుంది. ఇక నా స్టార్ స్టైలిష్ స్టార్ గురించి చెప్పాలి. నా కెరియ‌ర్ ఎఎతో స్టార్ట్ అయింది. నాకు ఏద‌న్నా జాబ్ ఇప్పించ‌మ‌న్నా నువు పిఆర్ఓ చెయ్య‌మ‌న్నారు బ‌న్నీగారు నాకు చాలా హెల్ప్ చేశాడు. త‌న‌తో పాటు త‌నవాళ్ళు కూడా ఎద‌గాల‌ని కోరుకుంటారు. త‌ను ఒక లీడ‌ర్‌. ఎంత మందికి చాలా చాలా ర‌కాలుగా హెల్ప్ చేస్తారు. 2009 క‌ళ్యాణ‌బాబు ఇంటికి వెళ్ళాను. టివి9లో మానేశావంట‌గా అన్నారు. అవును అన్నా వెంట‌నే ఒక క‌వ‌ర్ తెచ్చి ఇచ్చి ఉంచుకో అన్నారు. ఏద‌న్నా ఇబ్బంది క‌లిగితే చెప్పు అని వెళ్ళారు. ఇంత మంచి వ్య‌క్తులు కాబ‌ట్టే అంత మంచి స్టేజ్‌లో ఉన్నారు. 
 
అల్లు అర‌వింద్ మాట్లాడుతూ... శ్రీ‌ను ఇంత బాగా మాట్లాడేశాక ఇంక ఏం మాట్లాడాలో తెలియ‌డంలేదు. అత‌ను ఎన్ని నెల‌లు ప్రిపేర్ అయ్యాడో తెలియ‌దు. శ్రీ‌ను మాట్లాడి త‌న బ‌యోపిక్‌ని చూపించాడు మ‌నంద‌రికీ. విజ‌య్ చాలా వెరైట్ స‌బ్జెక్ట్స్ తీసుకుంటాడు. స్టోరీ డిఫ‌రెంట్‌గా ఉంటేనే చేయ‌డానికి ఒప్పుకుంటాడు. రాహుల్ కంగ్రాట్స్ టు యు. ఆల్ ద బెస్ట్‌. హీరోయిన్‌కి కూడా ఆల్ ద బెస్ట్‌. మా బ్యాన‌ర్‌లో చాలా హిట్స్ వ‌చ్చాయి. గీత‌గోవిందం ఒక నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకువెళ్ళింది థ్యాంక్యూ ఫ‌ర్ ద‌ట్ విజ‌య్‌. టీమ్ అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బన్నీ మీద నాకు క్రష్ వుంది... హీరోయిన్ ప్రియాంక